కరోనా వైరస్ (CoronaVirus) బారినపడి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8వేల ప్రజలు మృత్యువాతపడ్డారు. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 137కి చేరుకోగా ఇప్పటివరకూ దేశంలో ముగ్గురు చనిపోయారు. కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలు మూసివేత, మ్యాచ్‌ల నిలిపివేత, ఉద్యోగులకు ఇంటి వద్ద నుంచే పని (వర్క్ ఫ్రమ్ హోమ్) కల్పించడంతో పాటు అధికారులు జాగ్రత్తలు సూచిస్తున్నారు. కానీ కొందరికి మాత్రం కరోనాపై జోకులు పేలుస్తున్నారు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇందుకు అతీతుడేమీ కాదు. ఆయన నేను సైతం అంటూ ఓ వ్యంగ్య ట్వీట్ వదిలాడు.
Read also : కరోనా వైరస్ పోయినా శానిటైజర్స్ వాడాల్సిందే.. ఎందుకో తెలుసా?
‘కరోనా వైరస్ బారిన పడినవారిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందించడం చాలా మంచి నిర్ణయం. తమ జీవిత భాగస్వామిని అసహ్యించుకునే భార్య లేక భర్తకు ఇది గొప్పగా ఉపకరిస్తుందని’ డైరెక్టర్ వర్మ ట్వీట్ చేశాడు. కరోనా పాజిటీవ్‌గా తేలిన వారికి, అనుమానితులను దాదాపు రెండు వారాలపాటు ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే.
Photos: అదిరేటి డ్రెస్సు మీరేస్తే దడ
Good thing about isolation is, it’s a Great thing for husbands and wives who hate each other 😌
— Ram Gopal Varma (@RGVzoomin) March 17, 2020
వర్మ ట్వీట్‌కు భిన్న స్పందన వస్తోంది. మాలాంటి సింగిల్స్‌కు ఏ ఇబ్బంది లేదు కానీ, ఒకరిని మరొకరు వదిలి ఉండలేని భార్యభర్తలకు ఆ ఐసోలేషన్ వల్ల ఇబ్బందిగా ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. మరొకందరైతే మీ బ్రాండ్ ఇంకా వోడ్కానే తాగుతున్నారా అని వర్మకే రిటర్న్ పంచ్ ఇచ్చిన నెటిజన్లు సైతం ఉన్నారు. ఫోన్‌కు దూరంగా వర్మను ఐసోలేషన్‌లో ఉంచాలని సెటైర్లు పేలుస్తున్నారు. కరోనాతో భయపడి చస్తుంటే.. మధ్యలో నీ వెటకారం తగలెయ్యా అంటూ భిన్న స్పందన లభిస్తోంది.
నాభి అందాలతో వర్మ హీరోయిన్ రచ్చరచ్చ!
కాగా, ముఖ్యంగా విదేశాల నుంచి భారత్‌కు వచ్చే వారిని ఐసోలేషన్‌లో ఉంచి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. భారత్‌లో కోవిడ్19 పాజిటీవ్ తేలిన కేసులలో దాదాపు అందరు పేషెంట్లు విదేశాలకు వెళ్లి వచ్చినవారే కావడం గమనార్హం. అయినా సరే దేశంలో ఉంటున్న వారికి సైతం పరిశుభ్రత ముఖ్యమని, దానితో కరోనా రాకుండా నియంత్రించవచ్చునని చెబుతున్నారు.