Animal: యానిమల్ సినిమాలో చూపించిన ప్యాలెస్ ఏ స్టార్ హీరోదో తెలుసా?

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో చూపించిన ప్యాలెస్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త తెగ వైరల్ అవుతుంది..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 5, 2023, 07:58 PM IST
Animal: యానిమల్ సినిమాలో చూపించిన ప్యాలెస్ ఏ స్టార్ హీరోదో తెలుసా?

Ranbir Kapoor: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందాన హీరోయిన్గా చేసిన సినిమా యానిమల్. ఈ సినిమాలో అనిల్ కపూర్.. బాబీ డియల్ ముఖ్యపాత్రలో కనిపించి మెప్పించారు. తంద్రీ కొడుకుల మధ్య ప్రేమ అనే ఎమోషన్ తో సాగిన ఈ చిత్రంలో కొన్ని మితిమీరిన డైలాగ్ సీన్స్ ఉండటంతో.. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాని సోషల్ మీడియాలో తెగ విమర్శిస్తున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం సందీప్ రెడ్డి వంగ మార్కుతో ఈ సినిమాని సెన్సేషనల్ గా తీశారు అని తెగ పొగుడుతున్నారు. 

డిసెంబర్ 1న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రస్తుతం  బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది. ఇక సోషల్ మీడియా టైం లైన్ అంతా.. యానిమల్ మూవీ ఫీడ్ తో నిండిపోతుంది. విమర్శిస్తూనో..ప్రశంసిస్తూనో మొత్తం పైన సోషల్ మీడియాలో అందరూ ఈ చిత్రం గురించి చర్చ కొనసాగిస్తున్నారు. ఈక్రమంలోనే యానిమల్ సినిమాలో చూపించిన రణబీర్ కపూర్ తండ్రి ఉందే ప్యాలస్ పై ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ పాలస్ మరెవరితో కాదట.. ఒక బాలీవుడ్ స్టార్ హీరోదట.

మూవీలో అనిల్ కపూర్ ఆ తరువాత రణబీర్ కపూర్ ఉందే ఈ ప్యాలస్.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‭దట.  యానిమల్ లో చూపించిన ప్యాలెస్ సైఫ్ అలీఖాన్ కి చెందిన పటౌడీ ప్యాలెస్. వీరిది రాజ కుటుంబం. ఈ ప్యాలస్ దాదాపు 9 ఎకరాల విస్తీర్ణంలో 145 రూమ్స్ కలిగి ఉంటుంది. అంతేకాదు ఈ ప్యాలెస్ విలువ వచ్చి సుమారు 750 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by THE ADULT SOCIETY (@adultsociety)

అయితే ఈ ప్యాలెస్ కరీనాకపూర్ భర్త సైఫ్ అలీ గాంధీ అన్న విషయం నార్త్ ఆడియన్స్ కి చాలా మందికి తెలుసు. కానీ మన సౌత్ ఆడియన్స్ కి పెద్దగా తెలియదు. దీంతో ఇప్పుడు ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది.

Also Read: Telangana Election 2023 Result Live: బీజేపీ విజయం సాధించిన స్థానాలు ఇవే.. కీలక నేతలు ఓటమిపాలు 

Also read: Telangana Election Results 2023: తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి కారణాలేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News