Abusive Comments on Renu Desai: రేణూ దేశాయ్ చిల్లరది.. పవన్ వదిలేసి మంచి పని చేశాడన్న ఫ్యాన్!

Renu Desai Shared Pawan Fan's Abusive Comments: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ మీద ఆయన అభిమానులు దండయాత్ర మొదలు పెట్టారు, ఏకంగా ఒక అభిమాని అయితే చిల్లర దానా అంటూ కామెంట్లు చేశాడు. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Apr 9, 2023, 11:01 PM IST
Abusive Comments on Renu Desai: రేణూ దేశాయ్ చిల్లరది.. పవన్ వదిలేసి మంచి పని చేశాడన్న ఫ్యాన్!

Pawan Fan Abusive Comments on Renu Desai: అఖిరా నందన్ పుట్టినరోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ కు మధ్య పెద్ద అగాధాన్ని సృష్టించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా నిన్న రేణు దేశాయ్ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా అఖిరా నందన్ ను ఒడిలో కూర్చోబెట్టుకుని వీడియో షేర్ చేసి నీకు ఎన్ని ఏళ్ళు వచ్చిన ఇప్పుడే పుట్టినట్టు అనిపిస్తోంది అంటూ కామెంట్ చేసింది. దానికి ఒక నెటిజన్ అప్పుడప్పుడు ఇలా అఖిరా నందన్ ని చూపిస్తూ ఉండండి మా అన్న కొడుకుని చూపిస్తూ ఉంటే మాకు ఆనందంగా ఉంటుందని కామెంట్ చేశాడు.

దానికి రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీ అన్న కొడుకు ఏంటి మా అబ్బాయి, ఇలాంటివి ఎన్నో భరిస్తూ వచ్చాను ఇకమీదట భరించాలి అనుకోవడం లేదు ఏదైనా మాట్లాడేటప్పుడు కాస్త బుర్ర దగ్గర పెట్టుకుని మాట్లాడండి అని అర్థం వచ్చేలా ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీంతో రేణు దేశాయ్ మీద పవన్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఒక నెటిజన్ దారుణమైన కామెంట్ చేయగా దాన్ని కూడా తన సోషల్ మీడియా వేదికగా రేణు దేశాయ్ షేర్ చేసింది.

Also Read: Priyanka Singh Photos: బిగ్ బాస్ ప్రియాంక సింగ్.. అందాల ఆరబోతలో రాకింగ్.. ముందుకు వంగి మరీ..

పేరు హైడ్ చేయబడిన ఒక నెటిజన్ మా అన్న కొడుకును చూపించండి అంటే నెగిటివ్ కామెంటా? అరేయ్ బాబు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ దీన్ని అన్ ఫాలో కొట్టి అసలు లైక్స్, కామెంట్స్ ఏం పెట్టకండి. 2024 ఎలక్షన్స్ కి ఈ చిల్లరది కొత్త స్టంట్స్ స్టార్ట్ చేసింది. పవన్ కళ్యాణ్ బయోలాజికల్ ఫాదర్ అయినప్పుడు అన్న కొడుకు అనకుండా ఏమనాలి?  పవన్ కళ్యాణ్ దీన్ని వదిలేసి మంచి పని చేశాడు, ఇదే చిల్లర వేషాలు ఇంట్లో వేస్తే బయటికి గెంటేసినట్టున్నారు అందరూ అంటూ కామెంట్ చేసి వేణు దేశాయ్ ఫోటో కూడా షేర్ చేశాడు.

ఇక ఈ కామెంట్ ని హైలైట్ చేస్తూ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసిన రేణు దేశాయ్ మీరు ఒక మంచి కుటుంబం చూస్తే ఇలా ఎలా కామెంట్ చేయగలరు? ఒకసారి మీ తల్లిని అడగండి ఇది కరెక్ట్ ఉందా అంటూ ఆమె ప్రశ్నించారు. పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ని చిల్లరది అంటూ కామెంట్ చేయడం కరెక్ట్ కాదంటూనే ఆమె కూడా అఖిరా నందన్ పుట్టినరోజు విషయంలో పవన్ ఫ్యాన్స్ తో ఇలా గొడవ పెట్టుకోకూడదని పలువురు కామెంట్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ ఉద్దేశం ఏంటో కింద కామెంట్ చేయండి.

Also Read: Punch Prasad Hospitalised: జబర్దస్త్ కమెడియన్ కు అస్వస్థత.. మళ్ళీ హాస్పిటల్లో చేరిన పంచ్ ప్రసాద్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News