Pawan Kalyan Unknown Facts: విలక్షణమైన వ్యక్తిత్వం, జనం కోసం పుట్టిన హీరో.. పవన్ కళ్యాణ్ గురించి మీకు తెలియని మరిన్ని విషయాలివే!

Pawan Kalyan Birthday, Power Star Pawan Kalyan Unknown Facts. నేడు (సెప్టెంబర్ 2) పవన్ కళ్యాణ్ 'బర్త్ డే'. ఈ సందర్భంగా పవర్ స్టార్ గురించి కొన్ని విషయాలు మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేశాం.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 1, 2022, 09:27 PM IST
  • విలక్షణమైన వ్యక్తిత్వం
  • జనం కోసం పుట్టిన హీరో
  • పవన్ గురించి తెలియని విషయాలివే
Pawan Kalyan Unknown Facts: విలక్షణమైన వ్యక్తిత్వం, జనం కోసం పుట్టిన హీరో.. పవన్ కళ్యాణ్ గురించి మీకు తెలియని మరిన్ని విషయాలివే!

Pawan Kalyan Birthday, Unknown Facts about Power Star Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. 'మెగాస్టార్' చిరంజీవి సోదరుగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయినా.. ఆ ప్రభావం ఎక్కడా కనబడనీయలేదు. తన నటన, మేనరిజం, డ్యాన్స్‌తో ప్రేక్షుకులను అలరించారు. ఒక్కోమెట్టు ఎక్కుతూ స్టార్ హీరోగా ఎదిగారు. ప్రతి సినిమాలోనూ తనలోని కొత్త వేరియేషన్స్ చూపిస్తూ.. 'పవర్ స్టార్' అయ్యారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉంది. పవన్ పేరు వింటేనే అభిమానులకు ఒక వైబ్రేషన్.. ఓ సెన్షేషన్. ఆయన అంటే పడిచచ్చేవారు వారు ఎందరో ఉన్నారు. నేడు (సెప్టెంబర్ 2) పవన్ కళ్యాణ్ 'బర్త్ డే'. ఈ సందర్భంగా పవర్ స్టార్ గురించి కొన్ని విషయాలు మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేశాం. 

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో:
పవన్ కళ్యాణ్ 1971 సెప్టెంబర్ 2న బాపట్లలో జన్మించారు. చదువుపై పెద్దగా ఆసక్తి లేని పవన్ ఇంటర్‌తో చదువును ఆపేశారు. ఆపై మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నారు. 'కళ్యాణ్ బాబు' అనే పేరును 'పవన్ కళ్యాణ్'గా మార్చుకొని 1996లో సినీరంగ ప్రవేశం చేశారు.  'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. గోకులంలో సీత, సుస్వాగతం సినిమాలతో హీరోగా  నిలదొక్కుకున్నారు. ఇక 'తొలిప్రేమ' సినిమాతో స్టార్ అయ్యారు. తమ్ముడు, బద్రి, ఖుషి సినిమాలు ఆయనను 'పవర్ స్టార్'ను చేశాయి. జల్సా సినిమా పవన్ కెరీర్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. 

ఎన్నో పరాజయాలు ఎదురైనా:
గుడుంబా శంకర్, జానీ, బాలు, పంజా, తీన్మార్, బంగారం, అన్నవరం, రాంబాబు లాంటి ఎన్నో పరాజయాలు ఎదురైనా.. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. గబ్బర్ సింగ్ సినిమాతో చాలా ఏళ్లకు పవన్ భారీ హిట్ కొట్టారు. సినిమాకు తెలుగులో ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నారు. 'అత్తారింటికి దారేది 'సినిమా వసూళ్లలో అప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న రికార్డులను బద్దలు కొట్టింది. 'అజ్ఞాతవాసి' అంనంత్రం రాజకీయ రంగ ప్రవేశం చేసిన పవన్.. మూడేళ్ల తర్వాత 'వకీల్ సాబ్'తో మరోసారి సత్తాచాటారు. బీమ్లా నాయక్ నిరాశపరిచినా.. హరిహర వీరమల్లుపై ఆయన భారీ ఆశలు పెట్టుకున్నారు. 

దర్శకుడు, నిర్మాత:
పవన్ కళ్యాణ్ హీరోగానే కాదు నిర్మాతగానూ వ్యవహరించారు. అంజనా ప్రొడక్షన్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై సినిమాలు చేసారు. ముగ్గురు మొనగాళ్లు, సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. దర్శకుడి మారి జానీ సినిమా తీశారు. ఇక తన సినిమాలు కొన్నింటికి స్టంట్స్ మాస్టర్‌గానూ పని చిహ్సారు. జానీ, గుడుంబా శంకర్, సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాలకు కథా సహకారం అందించారు. 

జనం కోసం రాజకీయాల్లోకి:
పవన్‌ కళ్యాణ్‌ వ్యక్తిత్వపరంగా ఒక విలక్షణమైన వ్యక్తి. తాను అంత పెద్ద హీరో అయినా ఎదో వెలితి. సమాజంలో జరుగుతున్న సంఘటనలు చూసి దేశం కోసం మరేదో చెయ్యాలనే తపన ఆయనలో మొదలైంది. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అవినీతిపరుల అరాచకాలు చూసి జనం కోసం రాజకీయాల్లోకి వచ్చారు. 2014 మార్చి 14న జనసేన పార్టీని పవన్ స్థాపించారు. 2014 ఎన్నికలలో ఏపీలో పోటీచేయకుండా.. ప్రధాని మోడీ, చంద్రబాబుకు మద్దతు పలికారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగారు. అయితే ఆయనకు నిరాశే ఎదురైంది. అయినా కూడా జనం కోసం ఇప్పటికీ పోరాడుతున్నారు. 

మూడు పెళ్లిళ్లు:
పవన్‌ కళ్యాణ్‌ సినీ, రాజకీయంగా దూసుకుపోతున్నా.. వ్యక్తిగత జీవితంతో మాత్రం అప్పుడప్పుడు విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన అనంతరం ప్రత్యర్థి పార్టీలకు చెందినవారు పవన్ వ్యక్తిగత జీవితంపై అనేక విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే అవేమి పట్టించుకోని పవన్.. ముందుకు వెళుతున్నారు. 

పవర్ స్టార్ 'పవన్ కల్యాణ్' బర్త్ డే సందర్భంగా ఆయనకు zeenews.india.com తరుపున మనస్ఫూర్తిగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. పవన్ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలి కోరుకుంటున్నాం. 

Also Read: Disha Patani Images: అయ్య బాబోయ్ దిశా పటాని.. ఈ హాట్ అందాలు ఎప్పుడూ చూసుండరు

Also ReadSunny Leone Hot Pics: సన్నీ లియోన్ హాట్ ట్రీట్.. అమ్మడి అందాలకు కుర్రకారు ఫిదా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News