Adipurush Premiere Show: ప్రస్తుతం పాన్ఇండియా లెవల్లో సినీ ప్రియులు ఎదురుచూస్తున్న మూవీ ఆదిపురుష్. రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ జంటగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద సందడి చేయనుంది. రీసెంట్గా మూవీ మేకర్స్ ట్రైలర్ విడుదల చేయగా.. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఓం రౌత్ డైరెక్షన్లో మైథలాజికల్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో రాఘవుడి పాత్రలో ప్రభాస్, జానకి పాత్రను కృతి సనన్ యాక్ట్ చేశారు. గతంలో విడుదలైన టీజర్ నిరాశపర్చినా.. ట్రైలర్ మాత్రం అంచనాలకు మించి డిజైన్ చేశారు. టీజర్లో గ్రాఫిక్స్ వర్క్స్ ఏ మాత్రం బాగోలేవంటూ తీవ్రస్థాయిలో విమర్శలు రాగా.. ట్రైలర్‌పై మాత్రం ప్రశంసల వర్షం కురుస్తోంది. పాన్ ఇండియా వైడ్‌గా ఓ రేంజ్లో ఎక్స్పెటేషన్స్ పెరిగిపోయాయి.
అయితే తాజాగా ఈ మూవీపై ఓ బ్యాడ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ట్రిబెకా ఫెస్టివల్లో ఆదిపురుష్ సినిమాను ప్రీమియర్‌గా ప్రదర్శించనున్నట్లు మూవీ టీమ్ ఇప్పటికే ప్రకటించింది. జూన్ 7వ నుంచి జూన్ 18 వరకు ప్రీమియర్ షోల ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. అయితే వీటిలో ఒక షో క్యాన్సిల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మూడు స్పెషల్ షోస్‌లో ఒకటి ఒకటి రద్దు చేశారని సినీ సర్కిల్లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. షో క్యాన్సిల్‌కు సంబంధించి అసలు కారణం తెలియరాలేదు. జూన్ 15, జూన్ 17వ తేదీలలో మిగిలిన రెండు షోలు యథావిధిగా ప్రదర్శించనున్నట్లు తెలిసింది.
బాహుబలి సిరీస్ తరువాత ప్రభాస్ ఖాతాలో ఒక్క హిట్ లేకపోవడంతో అభిమానులు ఆదిపురుష్ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు. సాహో, రాధేశ్యామ్ చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట కొడుతుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. మోషన్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్‌తో అంచనాలు పెరిగిపోవడంతో విడుదల తేదీ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అభిమానుల అంచనాలకు ఆదిపురుష్ అందుకుంటుందో లేదో జూన్ 16న తేలిపోనుంది.
Also Read: Pawan Kalyan: 'పాపం పసివాడు..' అంటూ సీఎం జగన్‌కు పవన్ కళ్యాణ్ కౌంటర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి