Prabhas: మరోసారి పెద్ద మనసు చాటుకున్న ప్రభాస్.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారీ వరద సాయం..

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన వరద బీభత్సానికి చలించిన పోయిన ప్రభాస్ ఉభయ రాష్ట్రాలకు తన వంతుగా భారీ ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 4, 2024, 02:28 PM IST
Prabhas: మరోసారి పెద్ద మనసు చాటుకున్న ప్రభాస్.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారీ వరద సాయం..

Prabhas: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో ప్రజలకు ఏ చిన్న కష్టమొచ్చినా.. మేమున్నామంటూ తెలుగు హీరోలు ఎపుడు ముందుంటారు. ఈ నేపథ్యంలో  గత కొన్ని రోజులుగా వరదలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలను ఆదుకోవడానికి మన హీరోలు ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు. వరదల నేపథ్యంలో  సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆదుకునేందుకు తమ వంతుగా భారీ ఆర్ధిక సాయాన్ని అందిస్తున్నారు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్.. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ. 2 కోట్ల ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు. ఇందులో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ కు చెరో రూ. కోటి చొప్పున విరాళం అందజేస్తున్నట్టు ప్రకటించి మరోసారి మనసున్న మా రాజు అనిపించుకున్నారు.  

ప్రభాస్  కేవలం తెలుగు రాష్ట్రాలకే కాదు దేశంలో ఎక్కడ ఏ విపత్తు వచ్చినా స్పందిస్తూ తన వంతు బాధ్యతగా భారీ విరాళాలు ఇస్తూ వస్తున్నారు  ప్రభాస్. ఇటీవల కేరళ వయనాడ్ లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో బాధితులను ఆదుకునేందుకు ప్రభాస్ రూ. 2 కోట్ల ఆర్ధిక సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే కదా.

ఇప్పటికే సీనియర్ అగ్ర హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ యంగ్ టాప్ హీరోలైన  ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ చెరో రూ. 50 లక్షల చొప్పున రూ. కోటి ని విరాళంగా అందజేసారు. ఈ నేపథ్యంలో ప్రభాస్.. చెరో కోటి రూపాయిల చొప్పున రెండు కోట్లను రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించడం విశేషం. మరోవైపు నిర్మాతలు, ఇతర ఇతర నటీనటులు కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలకు తమ వంతుగా ఆర్ధిక సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. అటు తెలంగాణ ఉద్యోగ సంఘాలు రూ. 130 కోట్లను తమ మూల వేతనంలో ఒక రోజు జీతాన్ని విరాళంగా సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేసారు.

ప్రభాస్ విషయానికొస్తే.. రీసెంట్ గా ‘కల్కి 2898 ఏడి’ మూవీతో మంచి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అంతేకాదు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 1200 కోట్ల గ్రాస్ వసూళ్లను రూ. 600 కోట్ల వరకు షేర్ ను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. నెట్ ఫ్లిక్స్ లో హిందీలో స్ట్రీమింగ్ వస్తే.. అమెజాన్ ప్రైమ్ తెలుగు సహా ఇతర రీజనల్ లాంగ్వెజ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రభాస్ ప్రస్తుతం "ది రాజా సాబ్" మూవీతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ  భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రభాస్ లైనప్ లో ఉన్నాయి.

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News