Indian 2: కమల్ హాసన్ సినిమాకి తెలుగు హీరో ఫ్యాన్స్ షాక్.. ఇక కథ కంచికే!

Kamal Haasan Indian 2: తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు.. మిగతా భాషలతో పోల్చుకుంటే.. తమిళంలో ఎప్పుడూ.. తక్కువ కలెక్షన్లు అందుకుంటూ ఉంటాయి. తమిళ్ ప్రేక్షకులు అంత త్వరగా తెలుగు సినిమాలను యాక్సెప్ట్ చేయరు. ఈ నేపథ్యంలోనే కల్కి సినిమా విషయంలో కూడా ఇదే రిపీట్ అయితే.. ఆ ప్రభావం ఇండియన్ 2 సినిమా మీద ఉంటుంది.. అని ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 23, 2024, 10:50 AM IST
Indian 2: కమల్ హాసన్ సినిమాకి తెలుగు హీరో ఫ్యాన్స్ షాక్.. ఇక కథ కంచికే!

Kalki 2898AD: మరి కొద్ది రోజుల్లో ప్రభాస్ అభిమానులు ఎప్పటినుంచో.. ఎదురుచూస్తున్న.. కల్కి సినిమా విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన చిత్ర ట్రైలర్లు రెండూ… సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ఇక అన్ని భాషల నుంచి… స్టార్ నటినటులు ఈ సినిమాలో కనిపించనండడంతో కేవలం తెలుగు రాష్ట్రాల్లో.. మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా.. ఈ సినిమాకి మంచి క్రేజ్ ఏర్పడింది. 

ఇక ఈ సినిమాకి అదిరిపోయే ఓపెనింగ్స్ వస్తాయి.. అని ట్రేడ్ వర్గాలు ముందే చెప్పేస్తున్నాయి. అయితే ఎంత బ్లాక్ బస్టర్ సినిమా అయినా.. కూడా తమిళ్లో తెలుగు సినిమాలు వసూళ్లు కొంత తక్కువగానే.. ఉంటాయని చెప్పుకోవచ్చు. కాగా కల్కి సినిమా విషయంలో మాత్రం ఇలా జరిగితే బాగోదని.. ప్రభాస్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. 

ఈ ఏడాది తమిళ్ ఇండస్ట్రీ నుంచి విడుదల కాబోతున్న.. మొట్టమొదటి స్టార్ హీరో పాన్ ఇండియా సినిమా ఇండియన్ 2. కమల్ హాసన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే కల్కి సినిమా కలెక్షన్లు.. తమిళనాడులో ఎక్కువగా రాకపోతే ప్రభాస్ అభిమానులు.. ఇక్కడ కూడా ఇండియన్ 2 సినిమా థియేటర్లలో చూడమని తేల్చి చెప్తున్నారు. 

సినిమా ఎంత బాగున్నా కూడా ఓటీటీలో చూడడానికి ఎదురుచూస్తాం తప్ప.. థియేటర్లకి వెళ్లే ప్రసక్తే లేదని కామెంట్లు చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. ఒకవేళ కల్కి సినిమా ఫ్లాప్ అయితే ఇండియన్ 2 సినిమా కూడా.. తెలుగులో హిట్ అయ్యే అవకాశాలు తక్కువే అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఇండియన్ 2 సినిమా తక్కువ ప్రమోషన్స్ వల్ల.. తెలుగులో సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. మళ్లీ ఇలాంటి సమస్యల్లో కూడా ఈ సినిమా చిక్కుకుంటే.. ఇక కలెక్షన్స్ కథ కంచికే అంటున్నారు అందరూ.

మరోవైపు ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్న కమల్ హాసన్.. కల్కిలో కూడా విలన్ పాత్రలో కనిపించనున్నారు. దీపిక పడుకోనే హీరోయిన్ గా.. నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దిశా పఠాని, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. అంతేకాకుండా చాలామంది స్టార్ నటీనటులు.. కామియో పాత్రలలో కూడా కనిపించనున్నారు. ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లు అందుకుంటుంది అని, రికార్డ్ స్థాయిలో బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు ముందే చెబుతున్నారు. 

వైజయంతి మూవీస్ పతాకంపై.. అశ్వినీరత్ 600 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న కల్కి సినిమా.. జూన్ 27న విడుదల కాబోతోంది. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

Read more: Viral News in Telugu: కొంపముంచిన రీల్.. 300 అడుగుల లోతైన లోయలో పడిపోయిన కారు.. షాకింగ్ వీడియో

Read more: Viral video: అట్లుంటదీ మల్ల.. నరసింహ మూవీ స్టైల్ లో పాముకు కిస్ ఇచ్చిన తాత.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News