Kalki 2898 AD: కల్కి2898AD ప్రీ-రిలీజ్ ఆ రోజే.. సంబరాలు మొదలుపెట్టిన ప్రభాస్ ఫ్యాన్స్

Prabhas Kalki 2898 AD Update: కల్కి2898AD సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి వచ్చే చిన్న అప్డేట్ కూడా చాలా పెద్దగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 14, 2024, 09:40 PM IST
Kalki 2898 AD: కల్కి2898AD ప్రీ-రిలీజ్ ఆ రోజే.. సంబరాలు మొదలుపెట్టిన ప్రభాస్ ఫ్యాన్స్

Kalki2898AD Pre-Release Event: ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఆ తర్వాత మహానటి సినిమాతో సెన్సేషనల్ విజయం సాధించాడు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న కల్కి 2898AD సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రభాస్ హీరోగా చేస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. ఈ చిత్రం వైజయంతి మూవీస్ కి ఎంతో సెంటిమెంట్ డేట్ అయినా మే 9న విడుదల కావాల్సి ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ లోని ఎలక్షన్స్ వల్ల ఈ చిత్రాన్ని జూన్ 27 కి పోస్ట్ పోన్ చేశాడు సినిమా మేకర్స్. ఇక నిన్నటితో ఆంధ్ర ప్రదేశ్ ఎలక్షన్స్ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ చిత్ర ప్రమోషన్స్ ని త్వరలోనే ఘనంగా ప్రారంభించాలి అని నాగ్ అశ్విన్ భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

తాజా సమాచారం ప్రకారం హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయ‌నట. మే 22న ఈ ఈవెంట్‌ను నిర్వ‌హించ‌నున్నార‌ట‌ సినిమా యూనిట్. అతి త్వ‌ర‌లోనే ఇందుకు సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానుంద‌ట‌. ఇక తెలుగులో ప్రి రిలీజ్ ఈవెంట్ అవ్వగానే... మిగతా భాషల్లో కూడా ఈ చిత్రానికి ప్రమోషనల్ ఈవెంట్స్ నిర్వహించాలని భావిస్తున్నట్లు వినికిడి. ఈ వార్త తెలిసి ప్రభాస్ అభిమానుల సంబరాలు అప్పుడే మొదలైపోయాయి. ఈ ఈవెంట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నామని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నాడు.

కాగా ప్రభాస్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నారు. కల్కి తో పాటు సలార్ 2 చిత్రం కూడా త్వరలోనే విడుదల కానుంది. ఇక మారుతీ దర్శకత్వంలో ది రాజా సాబ్ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు మన డార్లింగ్. ఈ చిత్రాలు అన్ని పూర్తయిన తరువాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేయనున్నారు.

Read more: MP Elections 2024: ఎన్నికల వేళ కాంగ్రెస్ బంపర్ ఆఫర్.. ఇద్దరు భార్యలున్న వారికి కూడా ఆ పథకం.. వీడియో వైరల్..

Read more: Smell of Cooking Food: వంట స్మెల్ చూసి వావ్ అంటున్నారా..?.. షాకింగ్ విషయాలు వెల్లడించిన ఎన్ఓఏఏ పరిశోధకులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News