Mohan Babu: ఇప్పటికే మోహన్ బాబు తన ఇంట్లో జరిగిన గొడవలో భాగంగా ఒక జర్నలిస్ట్ పై అకారణంగా దాడికి పాల్పడటం.. ఈ నేపథ్యంలో సదరు జర్నలిస్ట్ కు తీవ్రంగా గాయాలు కావడంతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు మోహన్ బాబు పై అటెంప్ట్ టూ మర్డర్ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మంచు కుటుంబం పై 3 FIR లు నమోదు అయినట్టు రాచకొండ పోలీస్ కమిషనర్ తెలిపారు.
ఇప్పటికే మంచు కుటుంబంలో జరిగిన గొడవలపై అన్నదమ్ములపైన మంచు విష్ణు, మనోజ్ లను పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి పిలుపించుకొని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. మరోవైపు మీడియాపై దాడి కేసుతో పాటు మోహన్ బాబు ఫ్యామిలీపై ఇప్పటికే పలు అంశాలపై పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టు సమాచారం. అంతేకాదు న్యాయ పరంగా మోహన్ బాబు కుటుంబంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయమై పరిశీలిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.
మరోవైపు మోహన్ బాబు అరెస్ట్ విషయం లో ఎలాంటి జాప్యం లేదు. ఇప్పటికే ఆయనకు నోటీసులు పంపించాము. మోహన్ బాబు ఈ నెల 24 వరకు సమయం అడిగారు. కోర్టు కూడా టైం ఇచ్చింది కాబట్టి మేము ఆయన్ని అరెస్ట్ చేయలేదు. మోహన్ బాబు విచారణ పై మేము కూడా కోర్టు ను అడుగుతాము.
ఇప్పటికే మోహన్ బాబు వద్ద రెండు లైసెన్స్ గన్స్ ఉన్నాయి. వాటికి సంబంధించిన పర్మిషన్ చంద్రగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో తీసుకున్నారు. రాచకొండ సీపీ నుండి ఎలాంటి పర్మిషన్స్ లేవు. 2 గన్స్ ఉన్నాయి.Dbpl,ఒకటి మరొకటి స్పానిష్ మెడ్ గన్ ఉంది.
మరోసారి మోహన్ బాబు ను విచారణకు రమ్మంటూ నోటీసు ఇచ్చాకా ఆయన అటెండ్ అవ్వాలి. ఆయన విచారణ రాకుండా సమయం కావాలంటే కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవాలి. లేదంటే వారంట్ ఇష్యు చేస్తామన్నారు. నిన్న వెళ్లి పిటిషనర్ నీ కలిశాడు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.