Game Changer Imax: గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్, దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10న విడుదల కానుంది. పూర్తి పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కించినట్టు ఈ మూవీ ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. అభిమానులు, ప్రేక్షకులు రామ్ చరణ్‌ను ఏ విధంగా చూడాలనుకుంటున్నారో ఆ విధంగా శంకర్ ఈ సినిమాను తెరకెక్కించాడు. లార్జర్‌దేన్ లైఫ్ సినిమాను లార్జన్ స్క్రీన్ లో చూస్తే కలిగే అనుభూతి ఈ సినిమాను ఐమ్యాక్స్ ఫార్మాట్ లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.
పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కించారు. ఈ సినిమాను దివంగత శ్రీమతి అనిత సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా మెప్పింస్తుందనటంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.
రామ్ చరణ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్లో యాక్ట్ చేశారు. కియారా అద్వానీ కథానాయకగా యాక్ట్ చేసిన ఈ చిత్రంలో అంజలి కీలక క్యారెక్టర్ లో నటించారు. ఎస్.జె.సూర్య, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. గేమ్ చేంజర్ చిత్రాన్ని వెండితెరపై చూడడానికి అభిమానులు సహా అందరూ ఎంతో ఉత్సాహాంతో ఎదురుచూస్తున్నారు. వావ్ అనిపించే విజువల్స్, అద్భుతమైన యాక్షన్ సీన్స్ తో మాస్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ గా ఈ సినిమా అని చెప్పొచ్చు. ఐమ్యాక్స్ ఫార్మాట్ లో ఈ సినిమా విడుదల కాబోతుంది.
ఐమ్యాక్స్‌లో ‘గేమ్ చేంజర్’ సినిమా ప్రదర్శితం కానుందని తెలిసి నాకెంతో హ్యాపీగా ఉందన్నారు. ఈ సినిమాను విజువల్ వండర్‌గా, భారీదనంతో రూపొందించామన్నారు. దాన్ని ప్రేక్షకులు థియేటర్స్‌లో చూసి తప్పకుండా ఎంజాయ్ చేయడం పక్కా అని చెప్పొచ్చు. మొత్తంగా సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలయ్యే ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.