Kalki: ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. మనం, సైరా నరసింహారెడ్డి తర్వాత అమితాబ్ బచ్చన్ నటించిన తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం. మరోవైపు కమల్ హాసన్ కూడా ‘శుభ సంకల్పం’ వంటి సినిమా తర్వాత డైరెక్ట్ తెలుగులో నటించిన చిత్రం ‘కల్కి’నే. స్వతహాగా దక్షిణాది భామ అయిన దీపికా పదుకొణే ప్రస్తుతం బాలీవుడ్ లో నంబర్ వన్ కథానాయికగా సత్తా చూపెడుతోంది. ఈమె తెలుగులో నటించిన తొలి చిత్రం ఇదే. ఈ సినిమాపై తెలుగు సహా ఓవర్సీస్, హిందీ మార్కెట్లో రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే హిందీలో ఈ సినిమా దాదాపు రూ. 150 కోట్ల నెట్ వసూళ్లతో రూ. 200 కోట్ల వైపు దూసుకుపోతుంది.
ఇప్పటికే ఈ సినిమాపై పలువురు ప్రముఖులు ప్రశంసల ఝల్లు కురిపించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ‘కల్కి 2898 AD’ సినిమాను తన కుటుంబ సభ్యులతో కలిసి చూసిన హీరో రణ్ వీర్ సింగ్ ఎంతో ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యారు. అంతేకాదు భారతీయ చిత్ర పరిశ్రమలో ‘కల్కి’ సినిమా అద్భుతం అన్నారు. ప్రభాస్, కమల్ హాసన్ తమ యాక్టింగ్ తో అదరగొట్టారన్నారు. అంతేకాదు అమితాబ్ ఫ్యాన్స్ తప్పకుండా ఈ సినిమా చూడాలని పిలుపునిచ్చారు. ఇందులో ఇంటర్వెల్ తర్వాత అమితాబ్, ప్రభాస్ మధ్య వచ్చే ఫైట్స్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం అన్నారు. అంతేకాదు భార్య దీపికా ఎంతో సహజంగా నటించిన విషయాన్ని ప్రస్తావించారు. ఇలాంటి అద్భుత చిత్రంలో దీపికా కూడా ఉండటం సంతోషకరమైన విషయమన్నారు.
‘కల్కి 2898 AD’ మూవీ చూసిన ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. చూసిన ప్రతి వాళ్లు ఈచిత్రం అద్భుతం అంటూ కీర్తిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే రూ. 600 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించింది. హీరోగా ప్రభాస్ కు ఇది నాలుగవ 600 కోట్ల చిత్రం. బాహుబలి, బాహుబలి 2, సలార్ తర్వాత ‘కల్కి’ మూవీ రెబల్ స్టార్ కెరీర్ లో 4వ 600వ కోట్ల చిత్రంగా నిలిచి రికార్డులకు ఎక్కింది. భారతీయ నటుల్లో ఎవరికీ ఈ రికార్డు లేదనే చెప్పాలి.
Also Read: Electricity Bill Pay: ప్రజల్లారా విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారా? ఒక్క నిమిషం ఈ విషయం తెలుసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter