Rashmika Samantha : సమంతను వెనక్కి నెట్టేసిన రష్మిక.. అందనంత దూరంలో నేషనల్ క్రష్‌

Samantha instagram Followers సమంతకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. అయితే ఆమెకు ఈ మధ్య ఎక్కువగా నెగెటివిటీ పెరిగింది. ఆమె మీద ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో సమంత కాస్త వెనకపడినట్టుగా అనిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 30, 2023, 03:27 PM IST
  • నెట్టింట్లో తారల సందడి
  • దూసుకుపోతోన్న రష్మిక
  • నెమ్మదిగా సమంత హవా
Rashmika Samantha : సమంతను వెనక్కి నెట్టేసిన రష్మిక.. అందనంత దూరంలో నేషనల్ క్రష్‌

Rashmika Mandanna instagram Followers రష్మిక మందాన్న తాజాగా ఓ రేర్ ఫీట్‌ను అందుకుంది. టాలీవుడ్ హీరోయిన్లలో రష్మికే టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఇన్ స్టాగ్రాం ఫాలోవర్ల విషయంలో రష్మిక ఇప్పుడు జోరు చూపిస్తోంది. తాజాగా ఆమెకు 38 మిలియన్ల మంది ఫాలోవర్లు వచ్చి చేరారు. దీంతో రష్మిక టాలీవుడ్ టాప్ హీరోయిన్లందరి కంటే ముందంజలో ఉంది. సమంత, పూజా హెగ్డేలు సైతం రష్మికను అందుకోలేనంత దూరంలో ఉండిపోయారు.

ఇప్పుడు రష్మిక, పూజా హెగ్డే, సమంత ఇలా ఎవ్వరికీ హిట్లు లేవు. పైగా డిజాస్టర్లతో సతమతం అవుతున్నారు. ఈక్రమంలోనే కొత్తగా వచ్చిన సంయుక్త, శ్రీలీల వంటి వారు దుమ్ములేపేస్తున్నారు. అయితే రష్మిక, పూజ, సమంత టాప్ లీగ్‌లో ఉంటారు. ఇక టాప్ హీరోయిన్ ఎవరు అని అంటే.. వెంటనే సమాధానం చెప్పడం కష్టంగా మారుతుంది. కానీ సోషల్ మీడియా క్రేజ్‌ను అంచనా వేసి ఎవరు టాప్ అన్నది ఇట్టే చెప్పుకోవచ్చు.

సోషల్ మీడియా అంటే ఫేస్ బుక్, ట్విట్టర్ ఇన్ స్టాగ్రాం ఇలా చాలానే వస్తాయి. కానీ హీరోయిన్లు ఎక్కువగా ఇన్ స్టాగ్రాంలోనే ఉంటూ ఉంటారు. అక్కడే తమ తమ అభిమానులతో ఇంటరాక్ట్ అవుతుంటారు. అందాల ఆరబోతకు అడ్రస్‌గా నిలుస్తుంటారు. అయితే ఇన్ స్టాగ్రాంలోని ఫాలోవర్లతోనే హీరోయిన్ల స్టేటస్‌ను కూడా అంచనా వేస్తుంటారు. తాజాగా రష్మిక ఓ రేర్ ఫీట్‌ను అందుకుంది.

Also Read: Anchor Manjusha : అందమంతా మంజూష దగ్గరే ఉన్నట్టుందే.. ఆహా అనిపించేలా యాంకర్.. పిక్స్ వైరల్

సమంతకు పూజా హెగ్డేకు ఒకప్పుడు టగ్ ఆఫ్ వార్‌లా ఉండేది. ఇరువురి మధ్య సోషల్ మీడియాలో పోటి ఏర్పడింది. మజిలీలో సమంత అంత క్యూట్‌గా లేదంటూ పూజా హెగ్డే వేసిన పోస్ట్ ఎంతటి రచ్చగా మారిందో అందరికీ తెలిసిందే. సమంత, పూజా హెగ్డేల మధ్య అలా కోల్డ్ వార్ నడుస్తూనే వచ్చింది. ఇప్పుడు సమంతకే(26.4M) పూజా హెగ్డే(23.5M) కంటే ఎక్కువగా ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ ఇద్దరూ కూడా రష్మికను (38M)అందుకోలేనంత దూరంలో ఉన్నారు.

Also Read:  Rajamouli : ఎంత ప్రయత్నించినా లోపలకు వెళ్లనివ్వలేదు.. నాటి ఘటనపై నోరువిప్పిన రాజమౌళి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News