Vijay Deverakonda In Pushpa 3: తెలుగు సినిమాతోపాటు భారతీయ సినీ పరిశ్రమలో 'పుష్ప' సినిమాలు భారీ కలెక్షన్లతోపాటు ప్రేక్షకాదరణ పొందాయి. పుష్ప 2: ది రూల్ ప్రపంచవ్యాప్తంగా బంపర్ హిట్ కొట్టగా తాజాగా మూడో సిరీస్ కూడా రాబోతున్నదని చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పుష్ప 3లో ఎవరు నటిస్తున్నారనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి. ఈ విషయమై శ్రీవల్లి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. విజయ్ నటిస్తున్నది లేనిది నేషనల్ క్రష్ లీక్ చేసింది.
Also Read: Allu Arjun: అల్లు అర్జున్‌కు జైలు అధికారుల షాక్.. రాత్రంతా చంచల్‌గూడ జైలులోనే
పుష్ప ది రైజ్, పుష్ప 2: ది రూల్‌లో అల్లు అర్జున్ భార్య శ్రీవల్లిగా నటించిన రష్మీక మందన్నా తాజాగా పుష్ప 3లో కూడా ఆమె పాత్ర ఉండనుంది. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో రష్మిక మందన్నా కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. మరికొన్ని విషయాలు చెబుతూ రష్మిక 'పుష్ప 2కు సంబంధించిన విషయాలను కూడా షూటింగ్ సమయంలోనే చెప్పేవారు. సినిమా క్లైమాక్స్‌లో కనిపించిన వ్యక్తిని చూసి ఈయనెవరు? అని నేను ఆశ్చర్యపోయా' అని వెల్లడించింది. 'ప్రేక్షకుల మాదిరి కూడా అతడెవరో తెలుసుకోవడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నా' అని రష్మిక చెప్పింది. అయితే రష్మికకు పుష్ప 3లో కనిపించేది విజయ్ దేవరకొండ అనే విషయం తెలిసిందే అని సినీ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఆ విషయాన్ని బయటపెట్టకూడదనే పుష్ప టీమ్ ఆదేశానుసారం రష్మిక నోరు మెదపలేదని తెలుస్తోంది.
Also Read: Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట.. జైలుకు కాదు ఇంటికే! సంబరాల్లో ఫ్యాన్స్
పుష్ప 2 క్లైమాక్స్‌లో పుష్ప తన అన్న కూతురి వివాహానికి హాజరైతే బాంబు వేసిన వ్యక్తి ఒకరు వస్తారు. ఆ వ్యక్తి విజయ్ దేవరకొండ అని ప్రచారం జరుగుతోంది. అతడెవరా? అని సినీ పరిశ్రమలో చర్చ జరుగుతోంది. విజయ్‌కు రష్మిక స్నేహితురాలికి మించి అనుబంధం ఉండడంతో అన్ని విషయాలు ఆమెకు తెలుసని భావిస్తున్నారు. ఎక్కడా లీక్ చేయకుండా రష్మిక జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. అటు తమ అనుబంధంతోపాటు సినిమా విషయాలు బయటకు పొక్కకుండా రష్మిక, విజయ్, పుష్ప 3 చిత్రబృందం జాగ్రత్త పడుతున్నారని అర్థమవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter