Acharya Updates | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం ఆచార్య. ఈ మూవీని కొరటాల శివ దర్శకత్వం వహిస్తోండగా రామ్ చరణ్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న RRR చిత్రంతో బిజీగా ఉన్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఆచార్యలో కొన్నిసీన్స్‌లో కనిపించనున్నారు.
Also Read | 5000 రూపాయల బడ్జెట్‌లో బెస్ట్ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్, లిస్ట్ చెక్ చేయండి
ఆచార్య (Acharya) సినిమా షూటింగ్‌లో రామ్ చరణ్ త్వరలో చేరే అవకాశం ఉంది. తండ్రి చిత్రాన్ని నిర్మించడమే కాకుండా అందులో నటించే అవకాశం రావడంతో రామ్ చరణ్ తెగ సంతోషపడుతున్నాడట. తాజాగా ఈ మూవీలో చెర్రీ సరసన రష్మిక మందన్న నటించనుంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటికైతే ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
తెలుగులో టాప్ హీరోయిన్స్‌లో రష్మిక మందన్న కూడా ఒకరు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లో కూడా నటిస్తోంది. ఇక ఆచార్యలో రష్మిక ఎంపిక విషయంలో సినిమా యూనిట్ త్వరలో ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఒకవేళ రష్మిక ఇందులో ఎంపికైతే తన కెరియర్‌కు ప్లస్ పాయింట్ అవుతుంది.
Also Read | Telugu Memes: గ్రేటర్ ఎన్నికల్లో తక్కువ పోలింగ్, నెటిజెన్ల ట్రోలింగ్
ఆచార్య మూవీలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సరసన కాజల్ అగర్వాల్ నటించనుంది. మరిన్ని వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe