Rashmika Mandanna`s remuneration : రష్మిక మందన్న పారితోషికం ఎంత.. ?

రష్మిక మందన్న నివాసంపై ఐటి దాడులు జరగడం అటు కన్నడ సినీవర్గాల్లో ఇటు టాలీవుడ్ వర్గాల్లో అనేక రకాల చర్చలు వినిపిస్తున్నాయి. అందులో అతి ముఖ్యమైనది రష్మిక పారితోషికం ఎంత అనే అంశం. అవును ఇప్పుడు అందరి దృష్టి రష్మిక మందన పారితోషికంపైనే పడింది.

Pavan Reddy Naini Pavan | Updated: Jan 17, 2020, 09:12 PM IST
Rashmika Mandanna`s remuneration : రష్మిక మందన్న పారితోషికం ఎంత.. ?

రష్మిక మందన్న నివాసంపై ఐటి దాడులు జరగడం అటు కన్నడ సినీవర్గాల్లో ఇటు టాలీవుడ్ వర్గాల్లో అనేక రకాల చర్చలు వినిపిస్తున్నాయి. అందులో అతి ముఖ్యమైనది రష్మిక మందన్న పారితోషికం ఎంత అనే అంశం. అవును ఇప్పుడు అందరి దృష్టి రష్మిక మందన పారితోషికంపైనే పడింది. చేసింది కొన్ని సినిమాలే అయినా... అతి తక్కువ సినిమాలతోనే అతి ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ తరం హీరోయిన్లలో రష్మిక మందన్న కూడా ఒకరు. పాపులారిటీ పరంగా తక్కువ సినిమాలతో.. తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు ప్రఖ్యాతలు అయితే వచ్చుండవచ్చు కానీ.. అంతమాత్రాన్నే ఐటి అధికారుల దృష్టి పడేంత ఆదాయం మాత్రం సంపాదించి ఉండకపోవచ్చు కదా అనేదే కొందరి సందేహం. అయితే, అదే సమయంలో నిప్పు లేనిదే పొగ రాదన్నట్టుగా... ఏదో ఓ ఆధారం లేనిదే ఐటి అధికారులు కూడా ఆమెపై ఎందుకు కన్నేస్తారనే వాదనలూ వినిపిస్తున్నాయి. అలాగా అని మరీ ఇంత తక్కువ కాలంలోనే ఐటి దాడులు జరిగేంత ఆదాయం ఆమె వద్దా ఉందా అంటే.. అది ఆలోచించాల్సిన విషయమే. ఈ నేపథ్యంలోనే అసలు రష్మిక మందన్న పారితోషికం ఎంత అనే సందేహం అందరి మెదడను తొలిచేస్తోన్న ప్రశ్న. 

Read also : రష్మిక మందన్న నివాసంపై ఐటి దాడు వెనుక కొత్త కోణం ?

రష్మిక మందన్న ఫిలిం ఎంట్రీ..
రష్మిక మందన్న సినీరంగ ప్రవేశం.. సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన తీరుని ఓసారి పరిశీలిద్దాం. కిరిక్ పార్టీ అనే సినిమాతో తెరంగేట్రం చేసిన రష్మిక మందన్నకు ఆ సినిమాకుగాను అతి కొద్ది పారితోషికం మాత్రమే తీసుకున్నట్టు విజయ్ కర్ణాటక కథనం పేర్కొంది. రష్మిక మందన్న మాజీ బాయ్ ఫ్రెండ్ రక్షిత్ శెట్టి నిర్మించిన ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో.. ఆమెను వరుసగా ఇంకొన్ని అవకాశాలు వరించాయి. ఆ తర్వాత పునీత్ రాజ్‌కుమార్‌తో అంజనీపుత్ర, గణేష్‌తో చమక్ చిత్రాల్లో నటించింది. ఆ రెండు సినిమాలకు కూడా ఆమెకు ఏమంత పారితోషికం అందలేదనేది శాండల్‌వుడ్ వర్గాలు చెబుతున్న మాట.

రష్మిక మందన్న రాత మార్చిన ఛలో, గీత గోవిందం..
కన్నడ నాట రష్మిక రష్మిక మందన్నకు క్రేజ్ ఉన్నప్పటికీ.. అంతకన్నా రెట్టింపు క్రేజ్ వచ్చింది మాత్రం ఆమె తెలుగులో ఛలో, గీత గోవిందం సినిమాలు చేసిన తర్వాతే. ఆ రెండు సినిమాలు సూపర్ హిట్ అవడంతో రష్మిక మందన్నకున్న క్రేజ్ అమాంతం రెట్టింపయ్యింది. దీంతో ఆమె ఆ తర్వాత చేసిన సినిమాలకు రూ.50 లక్షల వరకు ఛార్జ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రష్మిక మందన్న కన్నడంలో సైన్ చేసిన పొగరు సినిమాకు రూ.65 లక్షలు తీసుకున్నట్టు వార్తలొచ్చాయి. 

కన్నడనాట కాస్ట్‌లీ హీరోయిన్..
సినిమాలు చేస్తున్న కొద్దీ రష్మిక మందన్నకు క్రేజ్ ఎలా పెరుగుతూ పోయిందో... అలాగే ఆమె కన్నడ నాట ఉన్న సాధారణ నిర్మాతలకు అందకుండాపోయిందనే టాక్ కూడా శాండల్‌వుడ్‌లో అంతే బలంగా వినిపించింది.

సరిలేరు నీకెవ్వరుతో మరింత పెరిగిన పారితోషికం..
సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ బాబు సరసన జంటగా నటించే అవకాశం రావడమే రష్మిక మందన కెరీర్‌లో ఓ ప్లస్ పాయింట్ కాగా.. ఆ సినిమాలో నటించడం ద్వారా వచ్చిన క్రేజ్‌తో ఆమె ఇప్పుడు ఏకంగా రూ. 1 కోటి వరకు చార్జ్ చేస్తోంది అంటూ మీడియా కోడైకూసింది. దీంతో సౌతిండియాలో ఇటీవల కాలంలో ఎక్కువ పారితోషికం అందుకుంటున్న హీరోయిన్స్ జాబితాలో రష్మిక మందన్న పేరు కూడా చేరిపోయిందనే టాక్ కూడా వినిపించింది. అయితే, రష్మిక మాత్రం ఎప్పుడూ తన పారితోషికంపై వస్తున్న వార్తలతో ఏకీభవించలేదు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలోనూ ఈ అంశంపై స్పందిస్తూ.. తాను ఇప్పటికీ సినీ పరిశ్రమలో బుడిబుడి అడుగులు వేస్తున్నానని చెప్పుకొచ్చిందామె. ఏదేమైనా.. బహుషా రష్మిక మందన రెమ్యునరేషన్ గురించి మీడియాలో వస్తోన్న కథనాలే ఆమె ఆదాయంపై ఐటి అధికారులకు అనుమానం రావడానికి ఓ కారణం అయ్యుండొచ్చేమోననే వాళ్లు కూడా లేకపోలేదు. ఇదండీ రష్మిక మందన పారితోషికంపై మీడియాలో వస్తోన్న కథనాల సారాంశం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..