అందమైన అమ్మాయిల కథలు చూపిస్తా: వర్మ సంచలనం

సినిమాల్లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిత్యం కొత్తదనం కోసం అన్వేషిస్తుంటాడు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారడమూ రాముకు కొత్తేమీ కాదు. తాజాగా క్లైమాక్స్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు వర్మ.

Updated: May 19, 2020, 03:50 PM IST
అందమైన అమ్మాయిల కథలు చూపిస్తా: వర్మ సంచలనం

శివ సినిమాతో టాలీవుడ్ సినిమాల్లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిత్యం కొత్తదనం కోసం అన్వేషిస్తుంటాడు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారడమూ రాముకు కొత్తేమీ కాదు. తాజాగా క్లైమాక్స్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు వర్మ. ఈ నెలలో విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసిన వర్మ మరో కొత్త ట్రెండ్ తీసుకొచ్చేశాడు.  నా విన్నపాన్ని మన్నించండి: ఫ్యాన్స్‌ను కోరిన NTR

ఆర్జీవీ వరల్డ్ థియేటర్ అనే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాడు వర్మ. శ్రేయాస్ ఈటీ యాప్‌ను పరిచయం చేస్తూనే సంచలన విషయాలు వెల్లడించాడు ఈ దర్శకుడు. ఈ యాప్‌లో కుటుంబ కథలు, అలాంటి సినిమాలు ఉండవని, అందమైన సెక్సీ మహిళ కథలు అందుబాటులో ఉంటాయని ట్వీట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. క్లైమాక్స్ అనే బోల్డ్ కంటెంట్ మీద పని చేస్తున్న వర్మ సరికొత్త థియేటర్ ప్రపంచాన్ని తీసుకొస్తున్నాడు.

ఆర్జీవీ వరల్డ్ థియేటర్ shreyas et appలో అందమైన అమ్మాయిల కధలు  (నాకిష్టం కాబట్టి ), పవర్ఫుల్ల్  మగాళ్ల  కధలు  (నాకిష్టం కాబట్టి), క్రిమినల్స్ కధలు (నాకిష్టం కాబట్టి ), పోలీసుల కథలు (నాకు ఇంకా ఇష్టం కాబట్టి), దెయ్యాల కధలు (నాకు ఇంకా ఇంకా ఇష్టం కాబట్టి) మాత్రమే అందుబాటులో ఉంటాయని, కుటుంబ కథలు ఉండవని వరుస ట్వీట్లు చేశాడు డైరెక్టర్ వర్మ. 

 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్
Bikiniలో అమెరికన్ అందం హాట్ పోజులు