Corona virus movie: అక్టోబర్ 15న ధియేటర్లలో విడుదలవుతున్న తొలి సినిమా

కరోనా వైరస్ సంక్రమణ నేపధ్యంలో ప్రపంచవ్యాప్తంగా కదలిక స్థంభించిపోయింది. అన్ లాక్ ప్రక్రియలో భాగంగా తిరిగి ఒక్కొక్కటి తెర్చుకుంటున్నాయి. అక్టోబర్ 15 నుంచి థియేటర్లు తెర్చుకోనున్న క్రమంలో విడుదల కానున్న తొలి సినిమా కరోనా వైరస్ కావడం విశేషం.

Last Updated : Oct 1, 2020, 11:57 AM IST
Corona virus movie: అక్టోబర్ 15న ధియేటర్లలో విడుదలవుతున్న తొలి సినిమా

కరోనా వైరస్ ( Corona virus ) సంక్రమణ నేపధ్యంలో ప్రపంచవ్యాప్తంగా కదలిక స్థంభించిపోయింది. అన్ లాక్ ప్రక్రియలో భాగంగా తిరిగి ఒక్కొక్కటి తెర్చుకుంటున్నాయి. అక్టోబర్ 15 నుంచి థియేటర్లు తెర్చుకోనున్న క్రమంలో విడుదల కానున్న తొలి సినిమా కరోనా వైరస్ కావడం విశేషం.

కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా లాక్ డౌన్  ( Lockdown ) ను చవి చూసింది.ముఖ్యంగా భారతదేశంలో మార్చ్ 24 నుంచి లాక్ డౌన్ ప్రకటితమై...ఎక్కడికక్కడ అంతా నిలిచిపోయింది. వలస కూలీలు చిక్కుకుపోయారు. కుటుంబాల మధ్య రాకపోకలు ఆగిపోయాయి. రవాణా స్థంభించింది. విద్యార్ధులు, ఉద్యోగులు ఎక్కడివారక్కడే ఉండిపోయారు. అనారోగ్య సమస్యలు తలెత్తినా ,,మరే సమస్య ఎదురైనా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సిన పరిస్థితి. ఉపాధి లేకపోవడంతో పస్తులుండి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా నెలకొంది. కరోనా వైరస్ బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. తెలిసిన సంఘటనలు కొన్ని మాత్రమే. బయటి ప్రపంచానికి తెలియని వాస్తవాలు చాలానే ఉన్నాయి. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. 

లాక్ డౌన్ కారణంగా మూతపడిన అనేక పరిశ్రమల్లో థియేటర్ల పరిశ్రమ ఒకటి. ఇప్పుడు అన్ లాక్ 5లో భాగంగా అక్టోబర్ 15 నుంచి నిబంధనలతో థియేటర్లు తెర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. లాక్ డౌన్ తరువాత సుదీర్ఘ విరామం అనంతరం ఇప్పుడు ధియేటర్లు తెర్చుకోనున్నాయి. లాక్ డౌన్ సమయంలోనే ఓటీటీ ప్లాట్ ఫారమ్ ద్వారా పలు సినిమాలు విడుదల చేసిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ramgopal varma ) ఇప్పుడు కరోనా వైరస్ ( Corona virus movie ) పేరుతో ఓ సినిమాను నిర్మించేశారు కూడా. లాక్ డౌన్ అనంతరం తెర్చుకోనున్న థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమా ఇదే ఇప్పుడు.  థియేటర్లలో విడుదల కాబోతున్న తొలి సినిమా తనదేనని ఆర్జీవీ ( RGV ) ఈ సందర్భంగా ట్వీట్ కూడా చేశారు.

లాక్ డౌన్ కారణంగా బంధింపడిన ఓ కుటుంబం ఎదుర్కొన్న కష్టాలు, కరోనా వైరస్ బారిన పడటం నేపధ్యంగా సాగే కధే రామ్ గోపాల్ వర్మ నిర్మించిన కరోనా వైరస్ సినిమా. అగస్త్య మంజు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 

Trending News