Samantha Special Pooja: సమంత ప్రత్యేక పూజలు.. ఫోటోలు వైరల్!

Samantha performs Special Poojas at Secundrabad Vedapaatashala: సమంత కొన్ని ప్రత్యేక పూజలు చేసినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 8, 2022, 06:42 PM IST
Samantha Special Pooja: సమంత ప్రత్యేక పూజలు.. ఫోటోలు వైరల్!

Samantha performs Special Poojas at Secundrabad Vedapaatashala: గత కొన్నాళ్లుగా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్న సమంత అనూహ్యంగా ప్రత్యేక పూజలు చేస్తూ కనిపించడం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సమంత జూలై నెల చివరి వారంలో విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమా షూటింగ్ లో పాల్గొంది. ఆ తర్వాత ఆమె సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆరోగ్యం గురించి రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి.

కొందరైతే ఒక అడుగు ముందుకు వేసి సమంత తల్లి రెండో వివాహం చేసుకోమని ఒత్తిడి తీసుకు రావడంతో సమంత గర్భసంచి తీయించుకోవడానికి సిద్ధమైందని అసలు తీయించుకుందని కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో ఇటీవల సమంత మేనేజర్ మీడియాకు ఒక నోట్ రిలీజ్ చేస్తూ ఆమె అనారోగ్యంగా ఉందన్న వార్తలు నిజం కాదని  క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఆమె త్వరలోనే అన్ని పుకార్లకు బ్రేక్ వేస్తారని కూడా పేర్కొన్నారు.

అయితే అనూహ్యంగా ఈరోజు తెల్లవారుజామున సికింద్రాబాద్ లోని ఒక వేద పాఠశాలలో సమంత ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారని తెలుస్తోంది. ఈ ఫోటోలలో కొంత మంది పూజారులు అలాగే వేద పాఠశాల విద్యార్థులు కనిపిస్తుండగా వారి మధ్యలో సమంత కుర్చీలో కూర్చొని కనిపిస్తుంది.

స్వతహాగా క్రిస్టియన్ అయినా సరే నాగచైతన్య వివాహం చేసుకున్న తర్వాత సమంత హిందూ మతానికి సంబంధించి కూడా కొన్ని ఆచారాలు, వ్యవహారాలు పాటిస్తూ ఉండేది. నాగ చైతన్యతో విడాకులు తీసుకోవడానికంటే ముందు కూడా ఆమె తిరుమల వెంకన్నను దర్శించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ రోజు ఆమె ప్రత్యేక పూజలు పాల్గొన్నారని తెలుస్తోంది. 

Also Read: మగతనం అంటే.. తాగి ఉన్న అమ్మాయితో కూడా మిస్‌ బిహేవ్‌ చేయకుండా ఉండటం! ఊర మాస్‌ ట్రైలర్‌

Also Read: Anany Panday Hot Photos: లైగర్ దెబ్బకు వెకేషన్లో అనన్య.. అందాల ఆరబోతలో తగ్గట్లేదుగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News