Samantha: ఎన్నారై ప్రేమలో సమంత.. ఈసారి గట్టి ప్లానింగే?

Samantha Ruthprabhu Hollywood Movie: అదేంటి ఎన్నారై ప్రేమలో సమంత ఏంటి? అని టెన్షన్ పడుతున్నారా? అసలు విషయం అది కాదు లెండి. ఆమె ఒప్పుకున్న కొత్త హాలీవుడ్ సినిమా స్టోరీ లైన్ ఇదే అనే ప్రచారం జరుగుతోంది. 

Written by - Chaganti Bhargav | Last Updated : May 28, 2023, 09:20 PM IST
Samantha: ఎన్నారై ప్రేమలో సమంత.. ఈసారి గట్టి ప్లానింగే?

Samantha Hollywood Movie Story Line: నటి సమంత నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత సరైన హిట్టు కొట్టేందుకు అనేక తంటాలు పడుతోంది. నిజానికి నాగచైతన్యకు కూడా సరైన సినిమాలు పడటం లేదు. అలాగే సమంత కూడా సరైన హిట్ కోసం ఎదురుచూస్తోంది. నిజానికి ఆమె హిట్ అందుకోకపోయినా ఆమె క్రేజ్ మాత్రం రోజురోజుకీ పెరిగిపోతుందనే చెప్పాలి.

ఇప్పటి వరకు తమిళ తెలుగు భాషల్లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక స్థాయికి వెళ్లిన ఆమెకు ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తర్వాత నార్త్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.  ఇక ఆమె విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన కొత్తలో ఒక హాలీవుడ్ సినిమా సైన్ చేసినట్లు ఆమె ప్రకటించింది. కానీ ఆ విషయం మీద ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు ఆమె మరో హాలీవుడ్ ప్రాజెక్టులో భాగమైనట్లుగా ప్రచారం జరుగుతోంది.

Also Read: Keerthy Suresh Marriage: కీర్తి సురేష్ పెళ్లిపై తండ్రి క్లారిటీ..అసలు విషయం చెప్పేశాడుగా!

సమంత త్వరలోనే ఒక చెన్నై స్టోరీ అనే ఒక ఇంగ్లీష్ సినిమాలో నటించబోతుందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో భారత సంతతికి చెంది ఇంగ్లాండ్లో సెట్ అయిన వివేక్ కల్రా అనే వ్యక్తి హీరోగా నటించనున్నాడు. ఫిలిప్ జాన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ఒక ఆసక్తికరమైన కథాంశం చుట్టూ తిరుగుతోందని తెలుస్తోంది. ఇంగ్లాండ్కు చెందిన ఒక యువకుడికి చెన్నైకి చెందిన యువతికి మధ్య జరిగే ప్రేమ కథగా ఈ సినిమా ఉండబోతుందని, త్వరలోనే సినిమా షూటింగ్ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రస్తుతానికి సమంత సిటాడెల్ ఇండియన్ వర్షన్ వెబ్ సిరీస్ షూటింగ్లో పాల్గొంటుంది. రాజ్ డీకే దర్శకత్వంలో ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతోంది. ఇప్పటికే ప్రియాంక చోప్రా నటించిన ఇంగ్లీష్ వర్షన్ తెలుగు భాషలో కూడా అందుబాటులో ఉంది. కానీ సమంత నటించిన ప్రాజెక్టు కోసం అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇక మరోపక్క సమంత విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. ఆ సినిమా కూడా ప్రస్తుతం షూటింగ్ జరుపుకోవడం గమనార్హం. 

Also Read: Adipurush Rights: చివరి నిముషంలో ప్రభాస్ ప్రాజెక్టుల నుంచి యూవీ క్రియేషన్స్ ఔట్.. అసలు విషయం ఏంటంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

 

 

Trending News