Samantha behavior:
సెలబ్రిటీలను చూడడానికి వారు ఎక్కడైనా బయట కనిపిస్తే అభిమానులు క్యూ కడతారు. కొంతమంది సెలబ్రెటీలు మాత్రం.. వారిని అసహ్యించుకుంటారు. ఇంకొంతమంది ప్రేమగా దగ్గరకు తీసుకొని వారితో సెల్ఫీలు దిగి అభిమానులను ఆనందపరుస్తూ ఉంటారు.
సరిగ్గా ఇలాంటి విషయాలే ఆ సెలబ్రిటీల మధ్య తేడాలను గుర్తిస్తూ వారిపై విమర్శలు గుప్పించేలా చేస్తాయి.ఇప్పుడు కూడా ఇలాంటి సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
కొద్ది రోజుల క్రితం తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమంతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. ముఖ్యంగా అక్కినేని ఫ్యామిలీని ఆమె విమర్శిస్తూ చేసిన కామెంట్లు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఇకపోతే సమంత - నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి కారణం కేటీఆర్ అని, ఎన్ కన్వెన్షన్ కూల్చివేయాలని ప్రస్తావనకు వచ్చినప్పుడు కేటీఆర్ సమంతను తన దగ్గరకు పంపించమని అడిగితే, నాగార్జున అందుకు సమంతను బలవంతం చేయగా.. సమంత ఒప్పుకోలేదని, అందుకే ఇద్దరికీ విడాకులు ఇప్పించారంటూ చాలా దారుణంగా కామెంట్ చేశారు సురేఖ. దీంతో సెలబ్రిటీలు మొత్తం సమంతకు అండగా నిలిచారు. అదే సమయంలో కొండా సురేఖ కూడా సమంతకు క్షమాపణలు చెప్పింది.
అయితే ఈ విషయంలో అక్కినేని కుటుంబ సభ్యులు స్పందించినా.. వారికి కనీసం ఒక క్షమాపణ కూడా చెప్పకపోయేసరికి అక్కినేని కుటుంబం కొండా సురేఖపై పరువు నష్టం దావా కేసు వేసింది. సమంతకు క్షమాపణలు చెప్పింది. మాకు చెప్పలేదు.. మాకు ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు సెలబ్రిటీలు స్పందిస్తున్నారంటే దానికి కారణం మా నాన్నగారి ఆశీర్వాదం అంటూ నాగార్జున చెప్పుకొచ్చారు. కానీ తాజాగా జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తే సమంతాకు ఎందుకు అండగా నిలబడ్డారో అందుకు సంబంధించిన వీడియోలను కూడా నెటిజన్స్ వైరల్ చేస్తూ ఉండడం గమనార్హం.
ముఖ్యంగా ఆ వీడియోలో ఏముందంటే నాగార్జున ఎయిర్ పోర్ట్ లో కనిపించగా.. ఒక అభిమాని పెద్దాయన ఆయన సెల్ఫీ తీసుకోవడానికి ముందుకు వస్తే నాగార్జున బాడీగార్డ్స్ పక్కకు తోసేశారు. ఆయన కింద పడబోయారు. అయినా సరే తనకేమీ పట్టనట్టు నాగార్జున వెళ్లిపోయారు. మరొకవైపు సమంత ఏదో పనిమీద బయటకు వస్తూ ఉండగా ఫోన్లో మాట్లాడుతున్నా సరే అభిమానులు సెల్ఫీ అడగడంతో తన ఫోన్ కాసేపు పక్కన పెట్టి మరీ అభిమానులకు సెల్ఫీ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోయింది.
Where has humanity gone? #nagarjuna pic.twitter.com/qnPjJngIxM
— Viral Bhayani (@viralbhayani77) June 23, 2024
ఇక ఇప్పుడు ఈ రెండు వీడియోలను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సమంత - నాగార్జున మధ్య తేడా చూశారా.. ఇదే ఆమె గొప్పతనానికి నిదర్శనం. ఒకరకంగా చెప్పాలి అంటే సమంత సంస్కారం ముందు నాగార్జున తక్కువే అంటూ కామెంట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇప్పుడు మామ కోడల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నారంటూ ఇంకొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
Also Read: Tirumala Laddu Controversy : తిరుమల లడ్డుపై సుప్రీం స్పెషల్ సిట్, టెన్షన్ లో ఏపీ రాజకీయ పార్టీలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి