Samantha: సమంతను ఇండస్ట్రీ వెలివేసిందా..?.. ఇప్పటి వరకు స్పందించింది ఆ ముగ్గురేనా..! సోషల్ మీడియాలో దుమారం..

Samantha ruth prabhu: సమంత తండ్రి జోసెఫ్ ప్రభు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెను ఇప్పటి వరకు అభిమానులు, ఇద్దరు, ముగ్గురు ఇండస్ట్రీకి చెందిన వాళ్లు రెస్పాండ్ అయ్యారు. దీంతో సామ్ అభిమానులు ప్రస్తుతం దీనిపై ఫైర్ ఉన్నారంట.

Written by - Inamdar Paresh | Last Updated : Nov 30, 2024, 07:09 PM IST
  • సమంతను పట్టించుకొని ఇండస్ట్రీ..!
  • సోషల్ మీడియాలో ఒకటే చర్చ..?
Samantha: సమంతను ఇండస్ట్రీ వెలివేసిందా..?.. ఇప్పటి వరకు స్పందించింది ఆ ముగ్గురేనా..! సోషల్ మీడియాలో దుమారం..

Samantha ruth prabhu fans fires on movie industry: సమంత రూత్ ప్రభు తండ్రి జోసెఫ్ ప్రభు ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ లో బ్రేకింగ్ హర్ట్ ఎమోజీని పెట్టి మరీ.. తన తండ్రి చనిపోయారని వార్త పోస్ట్ చేసి ఎమోషనల్ అయ్యారు. తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె అభిమానులు మాత్రం పెద్ద ఎత్తున దీనికి కామెంట్లు పెడుతూ.. తమ సంతాపం వ్యక్తం చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకొవాలని.. ఈ కష్టాన్ని ఎదుర్కొనే శక్తిని ఆ దేవుడు నీకు ఇవ్వాలని కూడా నెటిజన్లు సామ్ కు సపోర్ట్ గా కామెంట్లు చేస్తున్నారు. అయితే..సామ్ తండ్రి చనిపొయిన సంగతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దాదాపు.. ఒకరోజు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఆమె పోస్ట్ కు అభిమానులు మినహా.. ఇండస్ట్రీ నుంచి మాత్రం కేవలం ముగ్గురు మాత్రం స్పందించినట్లు తెలుస్తొంది.

సుధీర్‌బాబు, నితిన్‌, తేజ సజ్జా.. లు మాత్రమే.. సామ్ కు ధైర్యం చెబూతూ.. మీ నాన్న మెమోరీస్ నీతో ఎల్లప్పుడు ఉంటాయని, ఆయన ఎక్కడున్న బ్లెస్సింగ్స్ ఉంటాయని పోస్ట్ లు పెట్టినట్లు తెలుస్తొంది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కూడా వారు.. ఓంశాంతి అంటూ.. పోస్ట్ పెట్టారంట. అయితే.. సామ్ కు మాత్రం.. ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా పెద్దగా స్పందించకపోవడం ప్రస్తుతం వార్తలలో నిలిచిందని చెప్పుకొవచ్చు.

ఆమె క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పుకునే చిన్మయి, నందిని రెడ్డీ, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్,  చిరంజీవి, హింది నటులు, బాలీవుడ్, టాలీవుడ్ వర్గాలు స్పందించకపొవడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసే అంశంగా మారిందని నెటిజన్లు మండిపడుతున్నారంట. మరొవైపు అక్కినేని ఫ్యామీలీపై కూడా నెటిజన్ లు మండిపడుతున్నారంట. సాధారణంగా నోరులేని మూగ జీవాలు సైతం.. సాటి ప్రాణితో బాధతో ఉంటే గుంపులుగా ఒక దగ్గరకు చేరుకుంటాయి.

Read more: Samantha: అంతులేని విషాదంలో సమంత.. అక్కినేని ఫ్యామిలీపై మండిపడుతున్న నెటిజన్లు.. కారణం ఏంటంటే..?

అలాంటిది.. తండ్రిని కోల్పోయిన ఒక ఫెమస్ నటిని కనీసం పరామర్శించేందుకు.. సోషల్ మీడియాలో ఓదారుస్తు, ధైర్యం చెబుతూ.. నాలుగు మాటలు చెప్పేలేనంతా బిజీగా ఇండస్ట్రీ వాళ్లు ఉన్నారా.. లేదా సమంతాను అందరు వేలివేశారా.. అన్న చర్చ కూడా సోషల్ మీడియాలో జరుగుతుందంట. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News