Pathaan Movie Twitter Review : పఠాన్ ట్విట్టర్ రివ్యూ.. అలా అనుకుంటే పొరబడినట్టే!

Pathaan Movie Twitter Review షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీ నేడు థియేటర్లోకి వచ్చింది. ఈ చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఈ సినిమాతో షారుఖ్‌తో పాటు బాలీవుడ్‌ కూడా ఊపిరి పీల్చుకున్నట్టుగా అనిపిస్తుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 25, 2023, 06:32 AM IST
  • నేడు థియేటర్లోకి పఠాన్
  • నెట్టింట్లో కింగ్ ఖాన్ హవా
  • పఠాన్ కథలో ట్విస్టులు
Pathaan Movie Twitter Review : పఠాన్ ట్విట్టర్ రివ్యూ.. అలా అనుకుంటే పొరబడినట్టే!

Pathaan Movie Twitter Review షారుఖ్ ఖాన్, దీపిక పదుకొణెల కాంబోలో తెరకెక్కిన పఠాన్ సినిమా బుధవారం నాడు రిలీజ్ అయింది. ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓ వైపు కాంట్రవర్సీలు చుట్టిముట్టినా కూడా ట్రైలర్‌తో పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్‌లో షారుఖ్ కొత్త రికార్డులు క్రియేట్ చేశాడు. దాదాపు ఆరు లక్షల టికెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయి. అలాంటి ఈ సినిమా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

పఠాన్ సినిమా నిజంగానే ఓ పండుగలాంటి సినిమా.. నమ్మలేకపోతోన్నాను.. అద్భుతంగా ఉంది.. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని కోరుకుంటున్నాను.. అని ఓ నెటిజన్ ట్వీట్ వేశాడు. ఇక ఈరోజంతా కూడా పఠాన్ డే.. షారుఖ్‌కు కమ్ బ్యాక్ వచ్చినట్టే అని కామెంట్లు పెట్టేస్తున్నారు.

 

పఠాన్ సినిమా ఇంట్రవెల్ ఇప్పుడే అయింది.. ట్రైలర్ చూసి ఈ సినిమా కథను మీరు ఊహించి ఉండొచ్చు.. కానీ మీరంతా కూడా పొరబడినట్టే.. పప్పులో కాలేసినట్టే.. ట్రైలర్‌లో కథను ఏ మాత్రం కూడా రివీల్ చేయలేదు.. ప్రథమార్థం అంతా కూడా ఎంతో గ్రిప్పింగ్‌గా, ఇంటెన్స్‌గా, థ్రిల్లింగ్‌గా ఉంది.. షారుఖ్‌ ఎప్పుడూ ఓ అద్భుతమే అని చెప్పుకొచ్చాడు ఓ నెటిజన్.

 

మిమ్మల్ని తెరపై చూసి నాలుగేళ్ల ఒక నెల ఎనిమిది రోజులు అవుతోంది.. ఈ రోజు కోసం ఎదురుచూస్తున్నా.. నైట్ అంతా నిద్ర పట్టలేదు.. పొద్దున్నే ఆరుగంటలకు లేచా.. ఇప్పుడు షో ఉంది.. మీ సినిమా ఫుల్ ఎక్స్‌పెక్టేషన్‌తో వెళ్తున్నాను అంటూ మరో అభిమాని ట్వీట్ వేశాడు. ఇలా పఠాన్ సినిమా మీద అయితే ఇప్పటి వరకు అన్నీ పాజిటివ్ కామెంట్లే వినిపిస్తున్నాయి.

 

ఇప్పుడే పఠాన్ సినిమాను చూశాను.. సినిమా గురించి ఏం చెప్పాలి యార్.. అదిరిపోయింది.. వెళ్లి చూడండిగ.. దీనిపై నేను పూర్తి రివ్యూ రాస్తాను..  నా వరకు అయితే ఈ సినిమాకు 4.5 రేటింగ్ ఇస్తాను.. సినిమాను చాలా రోజుల తరువాత ఎంజాయ్ చేశాను.. కింగ్ బ్యాక్ వచ్చేశాడు అంటూ షారుఖ్‌కు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ పడినట్టే అని చెప్పుకొచ్చాడు.

Also Read:  Naatu Naatu oscar Nominations : టాలీవుడ్ హిస్టరీలో ఫస్ట్ టైం.. నామినేట్ అయిన నాటు నాటు

Also Read: Pawan Kalyan's Fan Death News: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. అభిమాని మృతి, ముగ్గురికి గాయాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News