Shakuntalam Special Show: సమంత రేంజ్ అంటే ఇదీ.. ఢిల్లీ BJP పెద్దల కోసం 'శాకుంతలం' స్పెషల్ షో..?

Shakuntalam Special Show for BJP Leaders in Delhi: సమంత హీరోయిన్ గా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘శాకుంతలం’ సినిమా మీద ఉన్న క్రేజ్ నేపధ్యంలో ఈరోజు సాయంత్రం ఢిల్లీలోని బిజెపి పెద్దల కోసం ఒక స్పెషల్ షో వేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.  

Written by - Chaganti Bhargav | Last Updated : Apr 14, 2023, 02:46 PM IST
Shakuntalam Special Show: సమంత రేంజ్ అంటే ఇదీ.. ఢిల్లీ BJP పెద్దల కోసం 'శాకుంతలం' స్పెషల్ షో..?

Samantha's Shakuntalam Special Show for BJP Leaders in Delhi: సమంత హీరోయిన్ గా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘శాకుంతలం’ విలక్షణ దర్శకుడు గుణశేఖర్ డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందింది. శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను నేటి తరం వారికి అందించాలని ఉద్దేశంతో ఒక అందమైన దృశ్యకావ్యంగా ఈ సినిమాని తీర్చిదిద్దాడు గుణశేఖర్. సొంత నిర్మాణంలో ఈ సినిమాని గుణశేఖర్ కుమార్తె నీలిమ నిర్మించింది.

సమంత శకుంతల పాత్రలో నటించిన ఈ సినిమాలో దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటించగా దుర్వాస ముని పాత్రలో మోహన్ బాబు, సారంగి పాత్రలో ప్రకాష్ రాజ్, మేనక పాత్రలో మధుబాల వంటి వారు నటించారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది కానీ సినిమాని త్రీడీలో రిలీజ్ చేస్తేనే ఆ కిక్కు వేరేలా ఉంటుందని చెబుతూ ఈ సినిమాని త్రీడి వర్షన్ రిలీజ్ చేయడం కోసం ఇప్పటివరకు వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఈ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అవుతుంది.

ఇది కూడా చదవండి:  Pooja Hegde Gown Photos: ఎల్లో కలర్ గౌనులో బుట్టబొమ్మలా పూజా హెగ్డే.. నెక్స్ట్ లెవల్ హాట్ ట్రీట్ చూశారా?

ఈ సినిమాని నిర్మించింది గుణశేఖరే అయినా తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. నిజానికి ఈ సినిమాకి ఒక ప్రీమియర్ షో కూడా ఇప్పటికే వేశారు. ఏప్రిల్ 10వ తేదీన హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ థియేటర్లో కామన్ పబ్లిక్ కోసం ఒక స్పెషల్ షో వేశారు. అయితే అనుకున్న స్థాయిలో ఆ స్పెషల్ షో కి ఆదరణ లభించలేదని ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 12వ తేదీన అంటే ఈరోజు వేయాలి అనుకున్న మీడియా స్పెషల్ షో రద్దు చేశారని తెలుస్తోంది.

అయితే ఇది పురాణాల కథ కావడం భారతదేశానికి పేరు రావడానికి కారణమైన భారత చక్రవర్తికి సంబంధించిన కథ కావడంతో ఈ సినిమా చూసేందుకు బిజెపి పెద్దలు కొంతమంది ఆసక్తి చూపించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం ఢిల్లీలోని బిజెపి పెద్దల కోసం ఒక స్పెషల్ షో వేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయని విషయం మీద క్లారిటీ లేదు కానీ ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతోంది. మరో పక్క సమంత ఆరోగ్యం బాలేదని అందుకే ఆమె ప్రమోషన్స్ కి కూడా డుమ్మా కొట్టిందని అంటున్నారు. 

ఇది కూడా చదవండి: Meenakshii Chaudhary Pics: జాకెట్ లేకుండా శారీలో మెరిసిన మీనాక్షి చౌదరి..భలే మోసం చేసింది మావా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News