Rudraveena Movie: మెగాస్టార్ చిరంజీవి 'రుద్రవీణ' టైటిల్‌తో కొత్త చిత్రం.. అంచనాలను అందుకుంటుందట!

2022 Rudraveena Movie poster out. రుద్రవీణ సినిమా ప్రిలుక్ పోస్టర్‌.. ప్రేక్షకులు, ఇండస్ట్రీ నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 25, 2022, 03:18 PM IST
  • 'రుద్రవీణ' టైటిల్‌తో కొత్త చిత్రం
  • అంచనాలను అందుకుంటుందట
  • రుద్రవీణ మళ్ళీ రాబోతోందా?
Rudraveena Movie: మెగాస్టార్ చిరంజీవి 'రుద్రవీణ' టైటిల్‌తో కొత్త చిత్రం.. అంచనాలను అందుకుంటుందట!

2022 Rudraveena Movie Pre look poster out: 'రుద్రవీణ' అంటే రౌద్రంతో కూడిన వ్యవహారం (అగ్రెసివ్ నెస్) అని అర్థం. రుద్రవీణ అనగానే ప్రతి ఒక్కరికి 'మెగాస్టార్' చిరంజీవి సినిమా గుర్తుకు వస్తుంది. కే బాలచందర్ దర్శకత్వంలో 1988లో చిరంజీవి నటించిన రుద్రవీణ చిత్రం ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరం లేదు. సంప్రదాయమే జీవిత పరమావధిగా భావించి సమాజాన్ని పట్టించుకోని ఓ గొప్ప సంగీత విద్వాంసుడి కొడుకు గ్రామ శ్రేయస్సు కోసం తన జీవితాన్ని త్యాగం చేసే యువకుడి కథే రుద్రవీణ. 

అలాంటి గొప్ప సినిమా టైటిల్‌తో ఇప్పటి వరకు ఏ హీరో కూడా సినిమా తీసి మెప్పించిన దాఖలాలు లేవు. తాజాగా రుద్రవీణ టైటిల్‌తో  నేటి తరానికి అనుగుణంగా ఓ సరికొత్త రీవేంజ్ డ్రామా రాబోతోంది. రాగుల గౌరమ్మ సమర్పణలో సాయి విల సినిమాస్ పతాకంపై రాగుల లక్ష్మణ్, రాగుల శ్రీనులు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మధుసూదన్ రెడ్డి దర్శకత్వంలో తెరక్కుతున్న ఈ సినిమాలో  శ్రీరామ్ నిమ్మల, ఎల్సా ఘోష్, శుభశ్రీ రాయగురు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన రుద్రవీణ సినిమా ప్రిలుక్ పోస్టర్‌.. ప్రేక్షకులు, ఇండస్ట్రీ నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అటు సినిమా లవర్స్ కూడా ఆప్పటి తరం రుద్రవీణను, ఇప్పటి తరం రుద్రవీణను కంపేర్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి 'రుద్రవీణ'ను ఏమాత్రం తపిస్తుందో అని ఫాన్స్ గుసగుసలు మొదలెట్టారు. అయితే పాత సినిమా టైటిల్‌కు ఏ మాత్రం మచ్చ రానీవకుండా తీస్తామని దర్శక, నిర్మాతలు చెపుతున్నారు. 

ఇప్పటి తరానికి అనుగుణంగా కొత్త రకమైన రీవేంజ్ డ్రామాతో రుద్రవీణ సినిమాను తీస్తున్నామని, ఈ సినిమాను కూడా ప్రేక్షకులను ఆదరించి అలరించేలా పలు జాగ్రత్తలు తీసుకున్నామని దర్శక, నిర్మాతలు అన్నారు. అప్పటి సినిమా లాగే ఈ సినిమా టైటిల్ కూడా ప్రజల్లోకి ఈజీగా వెళ్లే అవకాశం ఉంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ రుద్రవీణ ఈ మేరకు ఏంటర్టైన్ చేస్తుందో చూడాలి మరి.

Also Read: LSG vs RCB Eliminator Playing XI: లక్నోతో బెంగళూరు ఢీ.. ఎలిమినేటర్ మ్యాచ్‌కు ఆర్‌సీబీ స్టార్ బౌలర్‌ దూరం! తుది జట్లు ఇవే

Also Read: Riyan Parag-R Ashwin: రియాన్ పరాగ్.. నువ్ ఎప్పటికీ భారత జట్టులోకి రాలేవు! నువ్వు కోహ్లీవి కాదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News