Nagababu Comments: నాగబాబు నోటి దురుసు వ్యాఖ్యలు, బాడీ షేమింగే అంటూ వివాదం

Nagababu Comments: టాలీవుడ్‌లో కొందరి నోటి దురుసు కారణంగా అనవసర వివాదాలు పెరుగుతున్నాయి. తాజాగా నాగబాబు చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదాన్ని రాజేస్తున్నాయి. టాలీవుడ్ హీరోల్ని బాడీ షేమింగ్ చేసే వ్యాఖ్యలుగా మండి పడుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 28, 2024, 07:52 AM IST
Nagababu Comments: నాగబాబు నోటి దురుసు వ్యాఖ్యలు, బాడీ షేమింగే అంటూ వివాదం

Nagababu Comments: టాలీవుడ్ నటుడు వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా మార్చ్ 1న విడుదల కానుంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నేపధ్యంలో శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. టాలీవుడ్ హీరోల్ని బాడీ షేమింగ్ చేస్తూ చేసిన వ్యాఖ్యలంటూ కొత్త వివాదం రాజుకుంటోంది. 

మార్చ్ 1న వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా నేపధ్యం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఎలా పనిచేస్తుంది, దేశాన్ని రక్షించేందుకు ప్రాణాలు పణంగా పెట్టడం వంటి అంశాలు తెరకెక్కాయి. వరుణ్ తేజ్ ఈ సినిమాలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారిగా కన్పిస్తాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నాగబాబు నోటిదురుసు మరోసారి బయటపడింది. వరుణ్ తేజ్ కెరీర్ ప్రారంభం నుంచి రిస్క్ పాత్రలు ఎక్కువగా చేస్తున్నాడని నాగబాబు చెప్పుకొచ్చాడు. నాగబాబు ఎత్తు, బాడీ లాంగ్వేజ్ ఇండియన్ ఆర్మీ, పోలీస్ తరహా పాత్రలకు కచ్చితంగా ఉంటుందన్నాడు. 5.3 అంగుళాల ఎత్తుండే వ్యక్తి కూడా పోలీసు పాత్రలు చేస్తే చూడటానికి బాగుండదన్నాడు. 

ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమౌతున్నాయి. టాలీవుడ్‌లోని కొందరు హీరోల్ని నాగబాబు బాడీ షేమింగ్ చేస్తున్నాడని విమర్శిస్తున్నారు. 5.3 అంగుళాల ఎత్తంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లోని ఓ అగ్రహీరోను ఉద్దేశించి చేసినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం చూసి వరుణ్ తేజ్ కౌంటర్ ఇచ్చాడు. కొందరు కావాలనే తన తండ్రి నాగబాబు చేసిన వ్యాఖ్యల్ని ట్రోల్ చేస్తున్నారని చెప్పాడు. అసలు టాలీవుడ్‌లో 5.3 అంగుళాల ఎత్తున్న హీరోలు ఎవరూ లేరని తెలిపాడు. తన ఎత్తు 6.3 అంగుళాలు కాబట్టి ఫ్లో కోసం 5.3 అంగుళాల ఎత్తున్నవాళ్లు పోలీసు పాత్రలకు అంతగా సూట్ కారని చెప్పారన్నాడు. తన తండ్రి నాగబాబు చేసిన వ్యాఖ్యల్ని ఎవర్నీ ఉద్దేశించి కావన్నాడు. 

Also read: South Indian Beautiful Places: మార్చ్‌లో వెకేషన్‌కు దక్షిణ భారతంలోని టాప్ 5 అద్భుత ప్రదేశాలు

Also read: Anant Ambani Pre Wedding Event: పెళ్లి కాదు..ప్రీ వెడ్డింగే..ప్లేట్ భోజనం ఖర్చు 15 వేలు ఎన్ని వంటలంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News