Waltair Veerayya: ఎవరు పోటీకు వచ్చినా ఈ సంక్రాంతి అన్నయ్యదే, రవితేజ స్పీచ్ అదిరిందిగా

Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ వేడుకలో రవితేజ స్పీచ్‌తో చిరు అభిమానులకు పూనకం వచ్చేసింది. ఎవరు పోటీకు వచ్చినా సంక్రాంతి అన్నయ్యదేనంటూ రవితేజ కామెంట్ చేయడం గమనార్హం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 9, 2023, 06:24 AM IST
Waltair Veerayya: ఎవరు పోటీకు వచ్చినా ఈ సంక్రాంతి అన్నయ్యదే, రవితేజ స్పీచ్ అదిరిందిగా

విశాఖపట్నంలో జరిగిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజు వేడుకలో రవితేజ స్పీచ్ అందర్నీ ఆకట్టుకుంది. చిరు అభిమానులకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. చిరుతో తనకున్న అనుబంధాన్ని పదే పదే గుర్తు చేస్తూ సాగింది. 

ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో జరిగిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ వేడుక అద్దిరిపోయింది. భారీగా తరలివచ్చిన చిరు అభిమానుల మధ్య సందడిగా సాగింది. రవితేజ స్పీచ్ అద్దిరిపోయింది. చిరుతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు రవితేజ. ఎవరు పోటీకు వచ్చినా రాకపోయినా ఈ సంక్రాంతి అన్నయ్యదేనంటూ రవితేజ వ్యాఖ్యానించాడు. ఈ వేడుక ద్వారా సంక్రాంతి అప్పుడే ప్రారంభమైపోయిందని రవితేజ చెప్పగానే అభిమానులు కేకలతో మార్మోగించారు. స్టార్‌గా కాకుండా..మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా మాట్లాడాడు. 

విజయవాడలో జరిగిన విజేత విజయోత్సవ సభలో వేలాది అభిమానుల మధ్య ఒకడిగా హాజరై..ఏదో ఒకరోజు మెగాస్టార్ పక్కన కూర్చుంటానని స్నేహితులతో చెప్పిన సంగతి రవితేజ గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు పక్కన కాదు కానీ ఆయన చంకెనెక్కేశానని..అంతగా తనను ప్రేమిస్తారని చెప్పుకొచ్చాడు.

చిరు గొప్పతనం అదే

ఇన్నాళ్ల తన కెరీర్‌లో అన్నయ్య ఎవరి గురించీ తప్పుగా మాట్లాడటం తాను వినలేదని, ఎవరి మాటలైనా నొప్పించినా బాధను తనలోనే దాచుకుంటారని రవితేజ చెప్పాడు. వాల్తేరు వీరయ్య సినిమాలో అన్నయ్యతో గడిపిన రోజుల్ని ఎప్పటికీ మర్చిపోలేనంటూ భావోద్వేగానికి గురయ్యాడు రవితేజ.

ఈ సినిమాపై ఎన్ని అంచనాలైనా పెట్టుకోండి..అన్ని అంచనాల్ని ఈ సినిమా దాటేస్తుందని కితాబిచ్చాడు రవితేజ. ఈ సంక్రాంతి కచ్చితంగా అన్నయ్యదేనంటూ అభిమానులకు జోష్ ఇచ్చాడు. ఈ సినిమాతో బాబీ మరో స్థాయికి వెళ్తున్నాడని చెప్పాడు.

Also read: Waltair Veerayya Updates: శృతిహాసన్ ఈవెంట్‌కు రాకుండా ఎవరు బెదిరించారు, చిరు వ్యాఖ్యల వెనుక కారణమేంటి 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News