Actress Kavya Thapar Arrested: ఏక్ మిని కథ హీరోయిన్ కావ్య థాపర్ అరెస్ట్

Actress Kavya Thapar Arrested: టాలీవుడ్ నటి  కావ్యా థాపర్ అరెస్టైంది. పోలీసుల్ని దూషించడం, అవమానపర్చడం కేసులో జుహు పోలీసులు కావ్యాను ఇవాళ అరెస్టు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 18, 2022, 04:39 PM IST
  • టాలీవుడ్ నటి కావ్యా థాపర్‌ను అరెస్టు చేసిన జుహూ పోలీసులు
  • తాగిన మత్తులో ఘర్షణకు దిగడం, పోలీసులపై దాడి, అసభ్య పదజాలంతో దూషించడం
  • ఆరెస్టు చేసి అంధేరీ కోర్టులో హాజరు, జ్యుడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు
 Actress Kavya Thapar Arrested: ఏక్ మిని కథ హీరోయిన్ కావ్య థాపర్ అరెస్ట్

Actress Kavya Thapar Arrested: టాలీవుడ్ నటి  కావ్యా థాపర్ అరెస్టైంది. పోలీసుల్ని దూషించడం, అవమానపర్చడం కేసులో జుహు పోలీసులు కావ్యాను ఇవాళ అరెస్టు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

తెలుగు సినీ పరిశ్రమ ద్వారా సినిమాల్లో ప్రవేశించిన ఉత్తరాదికి చెందిన కావ్యా థాపర్..ఈ మాయ పేరేమిటో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. 2018 నుంచి ఇప్పటి వరకూ తెలుగు సహా ఇతర దక్షిణాది భాషా చిత్రాల్లో నటించింది. తత్కాల్ అనే హిందీ షార్ట్ ఫిల్మ్ ద్వారా వినోదరంగంలో ప్రవేశించింది. పతంజలి, మేక్ మై ట్రిప్ , కోహినూర్ ప్రకటనల్లో కూడా నటించింది.  ప్రముఖ ఓటీటీ వేదికపై గత ఏడాది విడుదలైన ఎక్ మిని కథలో కావ్యా థాపర్ నటించింది. 

జుహూలోని జేడబ్ల్యూ మేరియట్ హోటల్‌లో ఈ సంఘటన జరిగింది. తాగిన మత్తులో కొంతమందితో ఘర్షణకు దిగింది. దాంతో అక్కడివాళ్లు పోలీసులు సమాచారమిచ్చారు. ఇవాళ ఉదయం హోటల్ సిబ్బంది నుంచి ఫోన్ రావడంతో పోలీసులు అక్కడికి చేరుకునేటప్పటికీ కావ్యా థాపర్ (Kavya Thapar)న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ కన్పించింది. పోలీసులు కలుగజేసుకోవడంతో పోలీసులపై తిరగబడింది. మహిళా పోలీసు కాలర్ పట్టుకుని దాడి చేయడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషించిందని ముంబై పోలీస్ జోన్ 9 డీసీపీ మంజునాధ్ షింగే తెలిపారు. దాంతో పోలీసులు ఆమెను అదుపులో తీసుకుని జుహు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆమెపై సెక్షన్ 353, 504, 332, 427 ఐపీసీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అంధేరీ కోర్ట్‌లో ఆమెను హాజరుపర్చగా..కోర్టు ఆమెకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఇదంతా మద్యం మత్తులో తెలియకుండా చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. 

Also read: Aadavallu Meeku Joharlu: ఆడవాళ్లు మీకు జోహార్లు నుంచి మరో సాంగ్, రేపే ట్రైలర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x