Kolkata Medico: కోల్ కతా మెడికో బాధితురాలికి కుటుంబానికి సంఘీభావంగా టాలీవుడ్ ప్రముఖుల ర్యాలీ..

Kolkata Medico: కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ పై రేప్ చేసి మర్డర్ చేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ సందర్బంగా ఆమెకు న్యాయం జరిగి.. దోషులను శిక్షించాలని దేశ వ్యాప్తంగా అందరు ఉద్యమిస్తున్నారు. మరోవైపు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ కూడా కోల్ కతా మెడికో బాధితురాలికి న్యాయం జరగాయలంటూ హైదరాబాద్ లో రోడ్డెక్కారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 30, 2024, 07:55 AM IST
Kolkata Medico: కోల్ కతా మెడికో బాధితురాలికి కుటుంబానికి సంఘీభావంగా టాలీవుడ్ ప్రముఖుల ర్యాలీ..

Kolkata Medico:  కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ ని రేప్ చేసి హత్య చేసిన సంగతి దేశవ్యాప్తంగానే అందరినీ కలిచివేసిన విషయం తెలిసిందే. బాధితులకు అండగా నిలవాల్సిన కోల్ కతా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ .. దోషులకు అండగా నిలవడం సిగ్గు మాలిన చర్యగా అభివర్ణిస్తున్నారు. పైగా బెంగాల్ లో ముఖ్యమంత్రి చేతిలోనే హోం, వైద్య ఆరోగ్య శాఖలు ఉండటం గమనార్హం. ఓ లేడీ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఇలాంటి దురదుష్ట ఘటన చోటు చేసుకోవడం పై ప్రజా సంఘాలతో పాటు దేశ వ్యాప్తంగా ప్రజలు మమతా బెనర్జీ తీరును ఎండగడుతున్నాయి. దేశ వ్యాప్తంగా చాలా మంది మెడికోలతో పాటు సామాన్య ప్రజలు కూడా   చనిపోయిన బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని  సంఘీభావం తెలుపుతున్నారు.

ఈ నేపథ్యం లో తెలుగు సినీ ప్రముఖులు  కోలకతా  బాధితురాలి కుటుంబానికి సంఘీభావం తెలుపుతూ వాక్ నిర్వహించారు.తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, సెక్రెటరీ దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్, డైరక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీర శంకర్, నిర్మాత ఎస్ కె యెన్, జీవిత రాజశేఖర్, హీరోయిన్ కామాక్షి భాస్కరాల, అమ్మిరాజు కోల్ కతా మెడికో బాధితురాలి పక్షానా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.  రైటర్ అసోసియేషన్ సెక్రెటరీ ఏ యెన్ రాధా మాట్లాడుతూ "ఇవాళ సమాజం లో స్త్రీల పై జరగుతున్న దాడులు చూస్తుంటే, స్త్రీలకి గౌరవం దొరకడం లేదనిపిస్తుంది. స్త్రీ కి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందన్నారు.  అందుకోసం ప్రభుత్వం వైపు చూడకుండా, మన సంస్థల్లో, మన చుట్టుపక్కల, స్త్రీలని ఎలా ప్రొటెక్ట్ చేయాలో ఆలోచించుకోవాలన్నారు.  కలకత్తా లో జరిగిన సంఘటన ని మా యూనియన్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.

దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ..  నిజం చెప్పాలంటే, జరిగిన ఘటనపై  మాటలు రావట్లేదు. జరిగిన సంఘటన చూస్తుంటే చాలా బాధేస్తుందన్నారు. మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నాము.  మనం ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే ముందు, మనం మన పిల్లల్ని ఎలా పెంచుతున్నామనే విషయాన్ని  ఆలోచించుకోవాలి. జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ..
నేను ముప్పైయేళ్లుగా  ఇండస్ట్రీలో ఉన్నాను. ఈ ఇండస్ట్రీ నాకు బాగా గౌరవం ఇచ్చింది. కానీ ఆడపిల్లల గురించి ఆలోచిస్తుంటే బాధేస్తుందన్నారు. ఎంతో మంది ఇంటి పనుల తో పాటు కుటుంబాన్ని నడపాలని ఉద్దేశ్యం తో అన్ని ఫీల్డ్ లో రాణిస్తున్నారు.
జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాము. అంత వికృతమైన మెడికల్ కాలేజీ ఈ దేశంలో లేదు. గత 10 సంవత్సరాల నుండి ఉన్న ప్రభుత్వం కూడా దాని మీద చర్యలు తీసుకోకుండా ఒక క్రైమ్ సెంటర్ ల తయారు చేస్తున్నారని ధ్వజ మెత్తారు.

ఇలాంటి వాటికీ మనం మూల్యాలు ఎక్కడినుండి వస్తున్నాయో ఆలోచించాలి. తల్లి తండ్రులు వారి పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా సమావేశాలు పెట్టడమే కాకుండా మన తెలుగు చిత్రపరిశ్రమ తరపున హీరోలు, డైరెక్టర్లు మరియు సమాజాన్ని ప్రభావితం చేయగల శక్తి ఉన్న అందరు వ్యక్తులు ప్రధానమంత్రి కి, సిబిఐ కి మమతా బెనర్జీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పైన లేఖలు మరియు ఇమెయిల్స్  రాయాలి," అని వీర శంకర్ అన్నారు."ఒక యాక్టర్ గా కాకుండా ఒక డాక్టర్ గా తోటి డాక్టర్ కు జరిగిన ఈ ఘోరాన్ని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి నరరూప రాక్షసులని ఎంత త్వరగా శిక్షిస్తే అంత మంచిదన్నారు. దీంతో మిగితా వారు ఇలాంటి నేరాలు చేయాలి అన్నప్పుడల్లా భయపడాలన్నారు. . మా అసోసియేషన్ లో సభ్యులైన మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకొని 'విమెన్ సెక్యూరిటీ సెల్' స్థాపించడం జరిగిందన్నారు.

ప్రతి సభ్యురాలికి ఆ సెల్ ఇ - మెయిల్ మరియు ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. మా మహిళలు ఆ సెల్ ని సంప్రదించి వారి ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు. . వారి వివరాలు గోప్యంగాగా ఉంచుతామమన్నారు. . మహిళలందరూ ప్రస్తుతం ఉన్న టెక్నాలాజీ ని, పోలీస్ వారి షి-టీం యాప్ లను ఉపయోగించాలని మనవి చేస్తున్నట్టు  మా ఉపాధ్యక్షులు మాదాల రవి అన్నారు.

ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..

ఇదీ చదవండి:  చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News