Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ను డైరెక్ట్ చేయనున్న టాలీవుడ్ యంగ్ డైరెక్టర్... బిగ్ ఛాన్స్ కొట్టేశాడుగా...?

Tollywood Young Director With Salman Khan: తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన యంగ్ డైరెక్టర్ ఒకరు త్వరలో సల్మాన్ ఖాన్‌తో ఓ సినిమా చేయబోతున్నట్లు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 16, 2022, 11:56 PM IST
  • సల్మాన్ ఖాన్‌తో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ మూవీ...?
  • స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో నిమగ్నమైన ఆ డైరెక్టర్
  • ఇంతకీ ఆ యంగ్ డైరెక్టర్ ఎవరు...?
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ను డైరెక్ట్ చేయనున్న టాలీవుడ్ యంగ్ డైరెక్టర్... బిగ్ ఛాన్స్ కొట్టేశాడుగా...?

Tollywood Young Director With Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ఒకరు సినిమా చేయబోతున్నట్లు గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే సల్మాన్ కోసం సదరు డైరెక్టర్ స్క్రిప్‌ను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారని... త్వరలోనే సల్లూ భాయ్‌కి కథ వినిపించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ యంగ్ డైరెక్టర్ ఎవరంటే... హరీశ్ శంకర్.

డైరెక్టర్ హరీశ్ శంకర్ తాజాగా సల్లూ భాయ్‌ని కలిశారు. రామోజీ ఫిలిం సిటీలో ఓ యాడ్ షూట్ కోసం వచ్చిన సల్లూ భాయ్‌ని కలిసి కాసేపు ఆయనతో చిట్ చాట్ చేశారు. సల్లూ భాయ్‌తో దిగిన ఫోటోలను హరీశ్ తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. సల్మాన్‌తో గడిపిన సమయం అద్భుతంగా అనిపించిందని... జీవితంలో అందమైన క్షణాల్లో ఇది కూడా నిలిచిపోతుందని హరీశ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. తనకు సమయం కేటాయించినందుకు సల్లూ భాయ్‌కి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, సల్లూభాయ్‌తో ఈ కలయికకు మైత్రీ మూవీస్ నిర్మాత్ నవీన్ యేర్నేని కారణమని పేర్కొంటూ ఆయనకు కూడా కృతజ్ఞతలు చెప్పారు.

హరీశ్ సల్లూభాయ్‌ని కలవడంతో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతోందనే గాసిప్స్ మొదలయ్యాయి. సల్లూ భాయ్‌కి కథ చెప్పేందుకే హరీశ్ వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. హరీశ్ ఇప్పటికే ఆ స్క్రిప్ట్ వర్క్‌లో ఉన్నాడనే కథనాలు వస్తున్నాయి. ఒకవేళ నిజంగా ఈ కాంబినేషన్ సెట్ అయితే ఇక తిరుగుండదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో సల్మాన్ ఖాన్ 'దబాంగ్' చిత్రాన్ని తెలుగులో పవన్ కల్యాణ్‌తో 'గబ్బర్ సింగ్'గా రీమేక్ చేసి హరీశ్ బిగ్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. పవన్‌తో త్వరలో 'భవదీయుడు భగత్‌సింగ్' సినిమాను పట్టాలెక్కించనున్నాడు హరీశ్. బహుశా ఈ సినిమా తర్వాత సల్మాన్ ఖాన్‌తో సినిమా చేస్తాడేమో చూడాలి...!

Also Read: Karate Kalyani Interview: జీ తెలుగు న్యూస్‌తో కరాటే కళ్యాణి ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ

Also Read: Tollywood Top Hero: టాలీవుడ్‌ నెంబర్ 1 హీరో ఎవరు.. టాప్-10లో ఎవరి స్థానం ఎక్కడ... సర్వేలో తేలిందిదే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News