Chiru Vs Balayya: వీరయ్య కొంప ముంచిన సింహా రెడ్డి... ఒక్క హైదరాబాద్ లోనే ఇంత తేడానా?

Veera Simha Reddy Vs Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుండగా ఇప్పుడు ఒక కొత్త సమస్య తెర మీదకు వచ్చింది. ఆ వివరాలు

Last Updated : Jan 12, 2023, 11:36 PM IST
Chiru Vs Balayya: వీరయ్య కొంప ముంచిన సింహా రెడ్డి... ఒక్క హైదరాబాద్ లోనే ఇంత తేడానా?

Veera Simha Reddy Vs Waltair Veerayya Screens Count: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలు సంక్రాంతి కానుకగా ఒక్కరోజు వ్యవధిలోనే విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా జనవరి 12వ తేదీ విడుదలవగా చిరంజీవి నటించిన సినిమా మాత్రం 13వ తేదీ అంటే రేపు విడుదలవుతోంది.

అయితే నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో పాటు సినిమా చూసేందుకు ప్రేక్షకులు భారీ ఎత్తున ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ఆ ఎఫెక్ట్ మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా మీద పడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు హైదరాబాద్ లో కేవలం వాల్తేరు వీరయ్య సినిమాకి 692 షోలు మాత్రమే లభించాయని అంటున్నారు. అదే వీర సింహారెడ్డి సినిమాకి మాత్రం 106 స్క్రీన్లు లభించాయి. అంటే దాదాపు నాలుగు వందలకు పైగా స్క్రీన్లు ఈ రెండు సినిమాలకు తేడా వచ్చింది. ఒకవేళ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాకి మాత్రం పాజిటివ్ టాక్ రాకపోతే అది వాల్తేరు వీరయ్య సినిమాకి ప్లస్ అవుతుందని అనుకున్నారు.

కానీ అనూహ్యంగా బాలకృష్ణ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో పాటు మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ఆ ఎఫెక్ట్ కచ్చితంగా వాల్తేరు వీరయ్య సినిమా మీద పడే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం మేరకు ట్రేడ్ వర్గాల వారు చెబుతున్న దాని ప్రకారం వాల్తేరు వీరయ్య సినిమా మొదటి రోజు 692 స్క్రీన్ లలో ప్రదర్శితమవుతుంటే వీర సింహారెడ్డి సినిమా రెండో రోజు 338 స్క్రీన్స్లో ప్రదర్శనతోంది. తెగింపు సినిమా 100 స్క్రీన్స్లో ప్రదర్శితం అవుతుంది.

మొత్తం మీద నందమూరి బాలకృష్ణ సినిమాకి వచ్చిన పాజిటివ్ టాక్ వాల్తేరు వీరయ్య మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని అంటున్నారు. ఆ సినిమాకి కూడా పాజిటివ్ టాక్ రాకపోతే రెండవ రోజు తీసి మళ్ళీ వీరసింహారెడ్డి సినిమా వేయడానికి కూడా ఎగ్జిబిటర్లు ఏ మాత్రం వెనుకాడరని ఎందుకంటే వాళ్ళు చేసేది వ్యాపారం కాబట్టి వాళ్లు ఏ సినిమాకి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తే ఆ సినిమా మీదే వారు కూడా ప్రదర్శించే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.

Also Read: Perni Nani on VSR: వీర సింహా రెడ్డి డైలాగులపై పేర్ని ఫైర్.. ఆ సంతకం కోసమే ఎదురు చూశారంటూ!

Also Read: Veera Simha Reddy: వీర సింహా రెడ్డి కలెక్షన్స్ ఊచకోత.. బాలయ్య కెరీర్లోనే ఇదేం అరాచకం సామీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
 

Trending News