Vijay Devarakonda: శ్రీలంకలో విజయ్ దేవరకొండ.. ఆ క్రేజీ సినిమా కోసం!

VD12 update: రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. విజయాలు,‌అపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ.. దూసుకుపోతున్నారు ఈ హీరో. ఈమధ్యనే ప్రభాస్ హీరోగా చేసిన కల్కి సినిమాలో చిన్న పాత్రలో కనిపించారు. ఇక త్వరలోనే జెర్సీ లాంటి సూపర్ హిట్ తీసిన.. గౌతమ్ దర్శకత్వంలో కనిపించబోతున్నారు..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jul 8, 2024, 06:40 PM IST
Vijay Devarakonda: శ్రీలంకలో విజయ్ దేవరకొండ.. ఆ క్రేజీ సినిమా కోసం!

VD12 Release Date: పెళ్లి చూపులు సినిమాతో.. తన మొదటి కమర్షియల్ హిట్ అందుకున్నారు హీరో విజయ్ దేవరకొండ. ఆ తరువాత విడుదలైన అర్జున్ రెడ్డి చిత్రంతో సూపర్ స్టార్ గా మారారు.‌ ఆ సినిమా ఈ హీరో క్రేజ్ ను.. అమాంతం పెంచేసింది. అప్పటినుంచి వరస సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా.. దూసుకుపోతున్నారు. అయితే ఈ మధ్య మాత్రం ఈ హీరో టైం అంతగా బాగాలేదు. విజయ్ చేసిన ప్రతి సినిమా డిజాస్టర్ గా మిగులుతోంది.

సమంత హీరోయిన్గా చేసిన ఖుషి సినిమా మాత్రమే ఈమధ్య విజయ్..నటించిన చిత్రాలలో పరవాలేదు అనిపించుకుంది. ఖుషి సినిమాకు ముందు విడుదలైన లైజర్ అలానే తరువాత విడుదలైన.. ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్స్ గా మిగిలాయి. ఇక ఈ మధ్యనే నాగ్ అశ్విన్ ..దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమాలో ఒక చిన్న కామియో రోల్ చేశారు. కాగా ప్రస్తుతం ఈ హీరో తన ఆశలన్నీ రాబోయే చిత్రాల పైన పెట్టుకున్నాడు. 

ప్రస్తుతం విజయ్ చేతుల్లో దాదాపు మూడు సినిమాలు ఉండగా.. అందులో గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న మూవీ పైన అంచనాలు భారీగా ఉన్నాయి. విజ‌య్ కెరీర్‌లో 12వ సినిమాగా.. ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. సితార ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం VD 12 వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. 

కాగా తాజాగా ఈ చిత్రం నుంచి ఓ అప్‌డేట్ వ‌చ్చింది. ఈ సినిమా షూటింగ్‌లోని ఒక షెడ్యూల్‌ను శ్రీలంక‌లో ప్లాన్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఇక అందుకోసమే ఈరోజు మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. చిత్ర‌బృందంతో పాటు శ్రీలంకకు చేరుకున్నారు. అక్కడ విజ‌య్‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

 

జెర్సీ సినిమాతో సూపర్ విజయం అందుకున్న గౌతమ్..ఆ తరువాత అదే చిత్రాన్ని హిందీలో తెరకెక్కించారు. అక్కడ సైతం జెర్సీ సినిమా.. మంచి విజయం సాధించింది. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ చిత్రంతో మరో విజయం అందుకోవడానికి.. సిద్ధంగా ఉన్నారు ఈ డైరెక్టర్ ‌ ఈ సినిమాకి తమిళం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ రవిచందర్ సంగీతాన్ని అందిస్తోండ‌గా.. విక్రమ్‌, అంగమలై డైరీస్‌, జల్లికట్టు లాంటి అవార్డు విన్నింగ్ సినిమాలకు పనిచేసిన గిరీష్‌ సినిమాటోగ్రాఫర్ గా ప‌ని చేస్తున్నారు. కాగా ముందుగా ఈ చిత్రంలో సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీలను హీరోయిన్ గా అనుకున్నారు.. కానీ శ్రీలీల డేట్ల స‌మ‌స్య కార‌ణంగా.. ఈ సినిమా నుంచి త‌ప్పుకున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇక.. ఆ స్థానంలో ఎవ‌రిని తీసుకున్నారు అన్న సంగ‌తి ఇంకా తెలియ‌రాలేదు.

ఇక ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ తనకు గతంలో.. టాక్సీవాలా లాంటి విజయం అందించిన దర్శకుడు రాహుల్ సంకీర్య్త‌న్..ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో మూవీలో న‌టిస్తున్నాడు.

Read more: Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..

Read more:Snakes dance: పాముల సయ్యాట.. పచ్చని పొలంలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News