close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

తెలంగాణ గవర్నర్‌తో చిరంజీవి భేటీ

తెలంగాణ గవర్నర్‌తో చిరంజీవి భేటీ

Updated: Oct 6, 2019, 11:55 AM IST
తెలంగాణ గవర్నర్‌తో చిరంజీవి భేటీ

హైదరాబాద్‌: టాలీవుడ్ మెగాస్టార్‌ చిరం‍జీవి శనివారం తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించిన చిరంజీవి అనంతరం ఆమెకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. తాను నటించిన తాజా చిత్రం ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమాను చూడాలని గవర్నర్‌ను చిరంజీవి కోరారు. చిరంజీవి ఆహ్వానాన్ని మన్నించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. త్వరలోనే సినిమా చూస్తానని తెలిపారు. ఈ వివరాలను స్వయంగా గవర్నర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు.

ఇదిలావుంటే, మరోవైపు సైరా నరసింహా రెడ్డి సినిమా బాక్సాఫీస్‌ రేసులో దూసుకుపోతోంది. మెగా ఫ్యాన్స్ నుంచే కాకుండా అన్నివర్గాల ఆడియెన్స్ నుంచి సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో సైరా సినిమా మూడు రోజుల్లోనే వంద కోట్ల కలెక్షన్లు సాధించినట్టు ట్రేడ్ వర్గాల గణాంకాలు చెబుతున్నాయి.