థైరాయిడ్ ఓ సీరియస్ వ్యాధి. ఇది శరీరంలో ఓ ప్రముఖమైన గ్రంథి. గొంతులో ఉండే ఈ గ్రంథి..టీ3, టీ4 హార్మోన్స్ ఉత్పత్తి చేస్తుంటుంది. ఈ గ్రంథి నియంత్రణ సరిగ్గా లేకపోతే వివిధ రకాల సమస్యలు ఉత్పన్నమౌతాయి. ఆ వివరాలు మీ కోసం..
థైరాయిడ్ విడుదల చేసే హార్మోన్లు శరీరంలో వివిధ చర్యలకు కీలకంగా ఉపయోగపడుతుంది. అయోడిన్ లోపం థైరాయిడ్‌కు ప్రధాన కారణంగా ఉంది. ఒకవేళ థైరాయిడ్ గ్రంథి ఆకారం పెరిగితే..శరీరంలోని వివిధ ప్రక్రియలపై ప్రభావం కన్పిస్తుంది. థైరాయిడ్ ఉంటే..శరీరం బరువు తగ్గడమో లేదా పెరగడమో జరుగుతుంది. గొంతులో స్వెల్లింగ్, హార్ట్ బీట్ నియంత్రణ లేకపోవడం వంటి లక్షణాలు థైరాయిడ్ సమస్యలో కన్పిస్తాయి. అయితే కొన్ని సులభమైన చిట్కాలతో థైరాయిడ్ వ్యాధిని నియంత్రించవచ్చు.
అల్లం
అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు స్వెల్లింగ్, నొప్పిని దూరం చేయడంలో దోహదమౌతాయి. ఇందులో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. థైరాయిడ్ నియంత్రించేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. థైరాయిడ్ సమస్య ఉంటే అల్లం తినడం ప్రయోజనకరమౌతుంది.
ఆనపకాయ విత్తనాలు
ఆనపకాయ విత్తనాలు సేవించడం వల్ల డయాబెటిస్‌లో ప్రయోజనకరం. ఆనపకాయలో ఉండే జింక్..థైరాయిడ్ హార్మోన్ నియంత్రించేందుకు దోహదమౌతుంది. ఒకవేళ థైరాయిడ్ వ్యాధి ఉంటే..ఆనపకాయ విత్తనాలను డైట్‌లో భాగంగా చేసుకోవాలి.
బాదం
థైరాయిడ్ నియంత్రణకు బాదం అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే మెగ్నీషియం థైరాయిడ్ గ్లాండ్‌ను యాక్టివ్ చేస్తుంది. బాదంతో పాటు ఇతర డ్రైఫ్రూట్స్ కూడా థైరాయిడ్ నియంత్రణకు కీలకంగా ఉపయోగపడతాయి. విటమిన్లు, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్లు, మినరల్స్ వంటి న్యూట్రియంట్లు పుష్కలంగా ఉంటాయి.
ఉసిరి
ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది థైరాయిడ్ నియంత్రణలో దోహదపడుతుంది. ఉసిరి తినడం వల్ల ధైరాయిడ్ నియంత్రణ సాధ్యమౌతుంది. థైరాయిడ్ ఉంటే..ఉసిరి జ్యూస్ లేదా క్యాండి వంటి పదార్ధాలను డైట్‌లో భాగంగా చేసుకోవాలి.
పెసర పప్పు
పెసర పప్పు తింటే ఐయోడిన్ లోపం పోతుంది. ఇది తినడం వల్ల ప్రోటీన్ల లోపం కూడా తొలగిపోతుంది. థైరాయిడ్ రోగులకు పెసరపప్పు రోజువారీ డైట్‌లో భాగంగా చేసుకోవాలి.
Also read: Health Benefits: చెడు కొలెస్ట్రాల్, శరీర బరువు తగ్గడానికి ఇలా కొబ్బరి నీరు తాగండి చాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook