Vijay Rashmika Love: రష్మికతో ప్రేమలో విజయ్ దేవరకొండ.. బయటపెట్టేసిన అనన్య పాండే.. ఇదిగో వీడియో

బాలీవుడ్ ఫేమస్ షో కాఫీ విత్ కరణ్‌లో విజయ్ దేవరకొండకు సంబంధించి కరణ్ జోహార్ అనన్య పాండేని కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ రిలేషన్‌షిప్ స్టేటస్‌పై నువ్వేమనుకుంటున్నావని ప్రశ్నించాడు.

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 29, 2022, 05:19 PM IST
  • విజయ్ దేవరకొండ రష్మిక మందన్నా ప్రేమాయణం
  • కాఫీ విత్ కరణ్ షోలో బయటపెట్టేసిన అనన్య పాండే
  • వైరల్ అవుతున్న అనన్య పాండే వీడియో
Vijay Rashmika Love: రష్మికతో ప్రేమలో విజయ్ దేవరకొండ.. బయటపెట్టేసిన అనన్య పాండే.. ఇదిగో వీడియో

Vijay Deverakonda Rashmika Love: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. ఈ జోడీకి స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఈ ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తోందంటూ చాలాకాలంగా గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇద్దరు ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారని ఎప్పుడూ రూమర్స్ వస్తూనే ఉటాయి. విజయ్, రష్మికకు ఇంటర్వ్యూల్లో కూడా ఈ ప్రశ్న ఎదురవుతూనే ఉంటుంది. చాలా సందర్భాల్లో ఇద్దరూ తమ మధ్య అలాంటిదేమీ లేదని చెప్పేశారు. కానీ తాజాగా లైగర్ హీరోయిన్ అనన్య పాండే విజయ్ దేవరకొండ లవ్ గురించి బయటపెట్టేసింది.

బాలీవుడ్ ఫేమస్ షో కాఫీ విత్ కరణ్‌లో విజయ్ దేవరకొండకు సంబంధించి కరణ్ జోహార్ అనన్య పాండేని కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ రిలేషన్‌షిప్ స్టేటస్‌పై నువ్వేమనుకుంటున్నావని ప్రశ్నించాడు. దానికి అనన్య పాండే నవ్వుతూ తెలివిగా సమాధానం చెప్పింది. 'హీ ఈజ్ ఇన్ రష్.. రష్ టు మీట్ మికా సింగ్ లైన్..' అని చెప్పుకొచ్చింది. అనన్య చేసిన ఈ కామెంట్‌లో రష్ అంటే.. రష్మికనే అని.. ఆ విషయాన్ని ఆమె ఇండైరెక్ట్‌గా చెప్పిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సింగర్ మికా సింగ్ 'స్వయంవర్ మికా దీ వోహ్తీ' షో విన్నర్‌ ఆకాంక్ష పూరిని పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఆకాంక్ష పూరి మికా సింగ్ మధ్య 13 ఏళ్లుగా స్నేహం కొనసాగుతోంది. విజయ్-రష్మిక మధ్య కూడా చాలా ఏళ్లుగా స్నేహం కొనసాగుతోంది. విజయ్ కూడా మికా సింగ్ బాటలోనే నడుస్తున్నాడని చెప్పేందుకు అనన్య అతని ప్రస్తావన తీసుకొచ్చింది. విజయ్-రష్మిక ఇద్దరూ కలిసి గతంలో పలుమార్లు కెమెరాలకు కూడా చిక్కారు. కానీ లవ్ రూమర్స్‌ను మాత్రం సున్నితంగా తిరస్కరిస్తూ వస్తున్నారు.

ఇదే కాఫీ విత్ కరణ్ షోలో విజయ్ తన లవ్‌పై మాట్లాడుతూ.. తన ప్రేమాయణం గురించి చెప్పి అభిమానులను బాధపెట్టడం ఇష్టం లేదని, ఏదో ఒక రోజు తప్పకుండా పెళ్లి చేసుకుంటానని, ఆరోజు తప్పకుండా తన రిలేషన్‌షిప్ గురించి అందరికీ చెబుతానని చెప్పుకొచ్చాడు. మొత్తానికి విజయ్-రష్మిక లవ్ టాపిక్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

 

Read Also: Ashwini Dutt: నిర్మాతలపై సంచలన వ్యాఖ్యలు.. వెనక్కు తగ్గిన అశ్వినీదత్.. వారి నిర్ణయమే శిరోదార్యం అంటూ!

Read Also: Liger Attitude: విజయ్ ఇచ్చి పడేశాడుగా... దుమ్ము రేపుతున్న లైగర్ 'వాట్ లగా దేంగే' సాంగ్..

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News