నిరుపేదల కోసం నేనున్నా.. : మంచు మనోజ్

Last Updated : Nov 4, 2018, 01:41 PM IST
నిరుపేదల కోసం నేనున్నా.. : మంచు మనోజ్

నిరుపేదల కోసం నేనున్నా అంటున్నారు సినీనటుడు మంచు మనోజ్. తాను ఎక్కడున్నా అక్కడున్న నిరుపేదలకు ఉచిత క్రీడా సదుపాయాలు, ఆహారం, తాగు నీటి వసతి కల్పించాలనేదే తన అంతిమ ధ్యేయం అని మంచు మనోజ్ ట్విటర్ ద్వారా స్పష్టంచేశారు. ఓ ఖాళీ స్థలంలో ఫోటో దిగిన మంచు మనోజ్.. ఇక్కడినుంచే నిరుపేదలు, పేద విద్యార్థుల కోసం తాను ఏదైనా ప్రారంభించాలనుకుంటున్నాను అంటూ ఆదివారం ఉదయం ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. అయితే, మంచు మనోజ్ రాజకీయాల్లోకి వస్తున్నారా అని ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అసలు మీ అంతిమ లక్ష్యం ఏంటంటూ ఓ నెటిజెన్ సూటిగా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ చేసిన మరో ట్వీట్‌లో మంచు మనోజ్ ఈ సందేశాన్ని ఇచ్చారు. 

ఏదేమైనా నిరుపేదలకు ఏదైనా చేయాలనుంది అని మంచు మనోజ్ తాపత్రయపడుతున్న తీరు మాత్రం అభినందించదగిన విషయం. మంచు మనోజ్ తన లక్ష్యాన్ని అందుకున్న రోజు కచ్చితంగా రీల్ హీరోగానే కాకుండా రియల్ హీరోగానూ పేరు తెచ్చుకుంటారు. పేదలకు ఏదైనా చేయాలనుకుంటున్న మంచు మనోజ్‌కి మనమూ గుడ్ లక్ చెబుదాం.. గుడ్ లక్ మనోజ్.. 

Trending News