యూత్ హార్ట్ ఫేవరేట్ గా మారిన గీతా గోవిందం సాంగ్

Updated: Jul 12, 2018, 01:51 PM IST
యూత్ హార్ట్ ఫేవరేట్ గా మారిన గీతా గోవిందం సాంగ్

'గీతా గోవిందం' సినిమా ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది. కారణం ఒకే ఒక్క సాంగ్.. ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే..’ అంటూ సాగే ఈ సాంగ్, జస్ట్ ఒక్క రోజులో యూత్ హార్ట్ ఫేవరేట్ గా మారిపోయింది. ఈ సింగిల్  రిలీజై 24 గంటలు కూడా గడవక ముందే  మిలియన్  డిజిటల్  వ్యూస్ క్రాస్ చేసిందంటే ఆడియెన్స్ లో ‘గీతా గోవిందం’ సినిమాకి  ఏ రేంజ్ లో డిమాండ్ ఉందో తెలిసిపోతుంది.

సోషల్ మీడియాలో రిలీజ్ అయిన మూమెంట్ నుండి ఓవరాల్ గా పాజిటివ్ టాక్ అందుకుంటున్న ఈ సాంగ్, ఈ సినిమా ఆల్బమ్ లోని తక్కిన సాంగ్స్ పై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. సినిమాలో ఈ సాంగ్ ఏ సిచ్యువేషన్ లో ఉండబోతుందో  గెస్ చేయడం కష్టమే కానీ, కచ్చితంగా ఈ సినిమా మ్యూజికల్ హిట్ అవ్వడం ఖాయమనిపిస్తుంది.

ఎమోషనల్ లవ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండను కంప్లీట్ గా కొత్తగా ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు పరశురామ్. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా GA2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది.