‘లక్ష్మీస్ ఎన్టీఆర్’: NTR పాత్రలో  రంగస్థల నటుడు !!

లక్మీ ఎన్టీఆర్ మూవీలో ఎన్టీఆర్ పాత్రంలో నటించింది ఎవరో బయటపెట్టిన వర్మ

Updated: Jan 20, 2019, 01:33 PM IST
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’: NTR పాత్రలో  రంగస్థల నటుడు !!

దర్శకుడు వర్మ  ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ లోని పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ లను వరుసగా విడుదల చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పాత్రలో నటించింది ఎవరనే దానిపై జోరుగా చర్చ నడుస్తోంది. ఈ పాత్రలో నటించింది ఫలానా ఆర్టిస్ట్ అంటూ రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.

ఈ ఊహాగానాలను స్పందించిన వర్మ ..  ఎన్టీఆర్ పాత్ర పోషించింది ఎవరన్న విషయాన్ని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ పాత్ర పోషించింది  పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రంగస్థల నటుడని పేర్కొన్నారు. ఎన్టీఆర్ లా ప్రసంగించడం, హావభావాలు పలకించడం వంటి తదితర విషయాల్లో ఆయనకు శిక్షణ ఇచ్చిన విషయాన్ని వర్మ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.