/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

సామాన్యుకైనా, ధనవంతులకు మాత్రమే కాదు బ్యాంకులకు సైతం వడ్డీ రేట్లు చాలా కీలకం. కీల‌క వ‌డ్డీ రేట్లను రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) యథాతథంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుత రెపో రేటు 4 శాతం అలాగే కొనసాగనుంది. రెపో రేటును య‌థావిధిగా రిజర్వ్ బ్యాంక్ కొన‌సాగించ‌డం ఇది వ‌రుస‌గా మూడోసారి కావడం గమనార్హం. 

వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గ‌వ‌ర్నర్ శ‌క్తికాంత దాస్ శుక్రవారం వెల్లడించారు. తాజా నిర్ణయానికి మానిట‌రీ పాల‌సీ క‌మిటీ ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపింద‌ని ఆయ‌న వెల్లడించారు. రివ‌ర్స్ రెపో రేటు (Revrse Repo Rate) కూడా 3.35 శాతంగానే కొన‌సాగించాలని నిర్ణయం తీసుకున్నారు. రెపో రేటు (Repo Rate) అంటే బ్యాంకుల‌కు ఆర్బీఐ ఇచ్చే అప్పుపై విధించే వ‌డ్డీ రేటు. అదే విధంగా వాణిజ్య బ్యాంకులు ఆర్‌బీఐకి ఇచ్చే అప్పుపై విధించే వడ్డీ రేటును రివర్స్ రెపో రేటు (Reverse Repo Rate) అంటారు. 

Also Read : 7th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..

దేశంలో కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా సామాన్యులతో పాటు ఆర్థిక వ్యవస్థకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్తలు వహిస్తోంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రణ‌లో ఉంచ‌డ‌మే ల‌క్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని శ‌క్తికాంత దాస్ చెప్పారు. 

Also Read : ​Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా!

Also Read : WhatsApp Amazing Features: ఈ వాట్సాప్ ఫీచర్స్‌ను మీరు ట్రై చేశారా! 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Section: 
English Title: 
RBI keeps the Repo Rate unchanged third consecutive time
News Source: 
Home Title: 

RBI Repo Rate: కీలక వడ్డీ రేట్లు మరోసారి యథాతథం

RBI Repo Rate: కీలక వడ్డీ రేట్లు మరోసారి యథాతథం
Caption: 
RBI keeps the Repo Rate unchanged
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
RBI Repo Rate: కీలక వడ్డీ రేట్లు మరోసారి యథాతథం
Publish Later: 
No
Publish At: 
Friday, December 4, 2020 - 12:01
Request Count: 
52