తెరపైకి సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ మల్టీస్టారర్ ?

తెరపైకి సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ మల్టీస్టారర్ ?

Last Updated : Mar 14, 2019, 12:05 AM IST
తెరపైకి సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ మల్టీస్టారర్ ?

బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్‌లకు ఎంత పెద్ద మార్కెట్ వుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరికీ ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులు వున్నారు. అందుకే వీళ్ల సినిమాలకు వందల కోట్లలో కలెక్షన్స్ సైతం లభిస్తుంటాయి. అదే ఈ ఇద్దరూ కలిసి నటిస్తే, ఆ సినిమాపై ఇంకెంత భారీ స్థాయిలో అంచనాలు వుంటాయో ఊహించడం కష్టమే. అవును, త్వరలోనే ఈ ఇద్దరి కాంబోలో ఓ సినిమా రూపొందనున్నట్టు బాలీవుడ మీడియాలో ఓ టాక్ వినిపిస్తోంది. 

ఈ ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి ఓ సినిమాను తెరకెక్కించేందుకు భారీ బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి ప్లాన్ చేస్తున్నట్టు బాలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. 1952లో వచ్చిన బైజు బవ్రా అనే క్లాసిక్ సూపర్ హిట్ చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచనలో వున్న సంజయ్ లీలా భన్సాలి ఆ సినిమా కోసం సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం భన్సాలీ 'బైజ్‌నాథ్', 'బైజు', 'బైజు తాన్‌సేన్' పేర్లతో మూడు టైటిల్స్‌ను పరిశీలిస్తున్నాడట. 

ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ కన్నా ముందుగా సల్మాన్ ఖాన్‌తో భన్సాలీ విడిగా ఓ లవ్ స్టోరీ సినిమా రూపొందించనున్నాడు. ఈ సినిమా కోసం సైతం దిల్ దేదియా ఇన్షా అల్లా, ప్యార్ హో గయా ఇన్షా అల్లా అనే టైటిల్స్‌ను నమోదు చేయించాడు.

Trending News