Thodelu Movie Review: వరుణ్ థావన్ 'తోడేలు' కాటు వేసిందా?.. సినిమా ఎలా ఉందంటే?

Thodelu Telugu Movie Review: వరుణ్ ధావన్ హీరోగా కృతి సనన్ హీరోయిన్గా నటించిన భేడియా సినిమాని తెలుగులో తోడేలు పేరుతో గీత ఆర్ట్స్ సంస్థ విడుదల చేసింది. ఈ సినిమా ఎలా ఉంది అనేది సినిమా రివ్యూ చూసి తెలుసుకుందాం.   

Last Updated : Nov 25, 2022, 07:02 AM IST
  • వరుణ్ థావన్, కృతి సనన్ జంటగా భేడియా
  • తెలుగులో తోడేలు పేరుతొ రిలీజ్ చేసిన అల్లు అరవింద్
  • మూవీ ఎలా ఉందో ఒక లుక్కేయండి
Thodelu Movie Review: వరుణ్ థావన్ 'తోడేలు' కాటు వేసిందా?.. సినిమా ఎలా ఉందంటే?

Thodelu Telugu Movie Review: ఈ మధ్యకాలంలో సాధారణ సినిమాలను ప్రేక్షకులు ఏ మాత్రం ఎంకరేజ్ చేయడం లేదు. సినిమాలో కొత్తదనం ఉంటే తప్ప ప్రేక్షకులు ఆ సినిమాలను చూసేందుకు ఆసక్తి చూపించడం లేదు. అందుకే భాషతో సంబంధం లేకుండా కొత్తదనం ఎక్కడ ఉన్నా, కంటెంట్ ఎక్కడ ఉన్నా ప్రేక్షకులు ఆ సినిమాలను ఆదరిస్తున్నారు. పుష్ప ఆర్ఆర్ఆర్, కాంతార వంటి సినిమాలు ఇదే విషయాన్ని అనే ప్రూవ్ చేశాయి.

ఎలాగైనా బాలీవుడ్ నుంచి కూడా అలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు తీయాలని అక్కడ దర్శకనిర్మాతలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే చేసిన బ్రహ్మాస్త్ర కొంతమేర ఆకట్టుకో గలిగింది. అయితే ఇప్పుడు బాలీవుడ్ నుంచి భేడియా అనే సినిమా రూపొందగా ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ అయింది. వరుణ్ ధావన్ హీరోగా కృతి సనన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాని తెలుగులో తోడేలు పేరుతో గీత ఆర్ట్స్ సంస్థ విడుదల చేసింది. నవంబర్ 25వ తేదీన విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది అనేది సినిమా రివ్యూ చూసి తెలుసుకుందాం. 

కథ:
భాస్కర్(వరుణ్ ధావన్) అనే ఒక చిన్నపాటి కాంట్రాక్టర్. అరుణాచల్ ప్రదేశ్ లోని ఒక అటవీ ప్రాంతంలో రోడ్డు వేసే కాంట్రాక్టు దక్కించుకుంటాడు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత అనూహ్యంగా ఒక రాత్రి తోడేలు కాటుకు గురవుతాడు. అలా తోడేలు కాటుకు గురైన భాస్కర్ జీవితం ఒక్కసారిగా తల్లకిందులవుతుంది. ఆ తోడేలు కాటు వల్ల భాస్కర్ కూడా ప్రతిరోజు రాత్రి తోడేలుగా మారిపోతూ ఉంటాడు.

అలా మారి అడవిని నాశనం చేయడానికి వచ్చిన వారందరినీ మట్టు పెడుతూ ఉంటాడు. అసలు భాస్కర్ ని తోడేలు ఎందుకు కరిచింది? కరిచిన తర్వాత భాస్కర్ తోడేలుగా ఎలా మారాడు? ఆ తర్వాత భాస్కర్ మామూలు మనిషి అయ్యాడా? లేదా? ఆలు భాస్కర్ కు వెటర్నరీ డాక్టర్ అనిక(కృతి సనన్) ఎలా పరిచయమైంది? భాస్కర్ కోలుకోవడానికి ఆమె ఏమైనా సహాయం చేసిందా? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ:

సాధారణంగా ప్రకృతిని నాశనం చేయడానికి వచ్చిన వారిని దైవశక్తులు లేదా జంతువులు వేటాడుతూ అడవిని కాపాడుతూ ఉంటాయని అనేక సినిమాల్లో చూపించారు. దాదాపుగా ఈ సినిమా లైన్ కూడా అదే.  కాకపోతే అడవిని రక్షించేందుకు తోడేలు మానవుల్లోకి ప్రవేశించడం అనే కొత్త కాన్సెప్ట్ తీసుకున్నారు.

ఈ మధ్యకాలంలో అభివృద్ధి పేరుతో పెద్ద ఎత్తున అడవులను నాశనం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తూ ఉంటాయి. ఒక పక్క ప్రభుత్వాలు అడవులు ఏర్పడేలా చేయాలని, మొక్కలు పెంచమని అనేక ప్రయత్నాలు చేస్తున్నా మరో పక్కన అభివృద్ధి పేరుతో ఇలా మొక్కలను కొట్టేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అలా ఒక అడవిని నాశనం చేయడానికి సిద్ధమైన వరుణ్ ధావన్ కు తోడేలు రూపంలో షాక్ తగులుతుంది. ఆసక్తి కలిగించే విధంగా దర్శకుడు ఎంచుకున్న లైన్ చాలా బాగుంది కానీ ఎగ్జిక్యూషన్ విషయంలో కాస్త తడబడినట్లు అనిపిస్తోంది.

చూడడానికి విజువల్స్ అయితే అద్భుతంగా కుదిరాయి. హాలీవుడ్ రేంజ్ లో గ్రాఫిక్స్ వర్క్ కూడా చేశారు. స్క్రీన్ మీద తోడేలు కనిపించిన ప్రతిసారి ఆడియన్స్ త్రిల్ ఫీల్ అయ్యేలా చేశారు. కానీ కథనం విషయంలో కొంత అసహనానికి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. సినిమా పరంగా చూస్తే కొన్ని లాజిక్స్ కూడా మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. 

నటీనటులు:
నటీనటుల విషయానికి వస్తే వరుణ్ ధావన్ నటన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఒకపక్క మామూలు మనిషిగా నటిస్తూనే తోడేలుగా మారుతున్న సమయంలో అతని నటన అనితర సాధ్యమా అన్నట్టు సాగుతుంది. ఇక ఈ సినిమా కోసం ఆయన బాడీని చాలా కష్టపెట్టాడనే చెప్పాలి, అయితే ఈ పాత్రలో వరుణ్ ధావన్ తప్ప మరొకరు సూట్ అవ్వరేమో అనే విధంగా ఆయన ఆకట్టుకున్నాడు. ప్రతి సనన్ డాక్టర్ అనిక అనే పాత్రలో కనిపించింది.

లాస్ట్ లో ఒక షాకింగ్ ట్విస్ట్ ఇచ్చినా సరే ఆమె అందంగా కనిపించింది మాత్రం తుమకేశ్వరి అనే సాంగ్ లో మాత్రమే. మిగతా సినిమా అంతా ఆమె పెద్దగా యాక్టివ్ పార్ట్ తీసుకోలేదని చెప్పాలి. ఇక పాతాళలోక్ ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమైన అభిషేక్ బెనర్జీ నటన ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. ఈ సినిమాలో అతని కామెడీ టైమింగ్ అద్భుతంగా కుదిరింది. ఇక వీరు కాక దీపక్ దొబ్బిర్యాల్, పాలిన్ కబాక్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో తమ పరిధి మేర నటించి ఆకట్టుకున్నారు
 
టెక్నికల్ టీమ్:
ఇక ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే దర్శకత్వం వహించిన అమర్ కౌశిక్ మంచి లైన్ తీసుకున్నాడు. కొంత అందరికీ తెలిసిన కదా అయినా దాని తనదైన శైలిలో నేటి మోడ్రన్ యుగానికి తగినట్లుగా చెప్పేందుకు ప్రయత్నం చేసి దాదాపు సఫలమయ్యాడు. కొంతమేర ఇబ్బందికర లాజికల్ లేని సీన్లు ఉన్నాయి అనిపించినా ఓవరాల్ గా చూస్తే సినిమా పరంగా దర్శకుడు ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. నీరేం భట్ అందించిన కథ బాగుంది అయితే ఎగ్జిక్యూషన్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండు అనిపిస్తుంది.  

సచిన్ జిగార్ అందించిన పాటలు బాగున్నాయి. తుమకేశ్వరి పాటైతే సినిమాకి ప్లస్ పాయింట్. జిష్ణు బట్టాచార్జి కెమెరా పనితనం సినిమాని వేరే లెవల్ కి తీసుకెళ్ళింది సినిమా ఆద్యంతం అడవిలోనే సాగుతూ ఉండడంతో జిష్ణు తన కెమెరా పనితనాన్ని చూపించి అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. స్పెషల్ గా చెప్పుకోవాల్సింది విఎఫ్ఎక్స్ గురించి.  విఎఫ్ఎక్స్ కూడా అద్భుతంగా కుదరడంతో సినిమాకి మంచి విజువల్స్ అయితే లభించాయి. ఎక్కడా వంక పెట్టే విధంగా లేకుండా ఈ సినిమాని మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో తీర్చిదిద్దారు.

ఫైనల్ గా 
ఫైనల్ గా ఒక్క చెప్పాలంటే ఈ ‘తోడేలు’ అనేది మనం చిన్నప్పుడు చదివిన ఒక చందమామ కథ లాంటి ఫాంటసీ డ్రామా. ఇది నిజంగా జరుగుతుందా అంటే అవునని, అలాగని కాదని చెప్పలేము. పిల్లలతో కలిసి సరదాగా చూడదగిన సినిమా కొంత మేర రక్తపాతం ఉంటుంది కానీ పిల్లలు కూడా ఎంజాయ్ చేసే పర్ఫెక్ట్ వీకెండ్ థ్రిల్లర్ కామెడీ మూవీ ఇది.  

Rating : 2.5/5

Also Read: Love Today Telugu Movie Review : లవ్ టుడే రివ్యూ.. ఫన్ అండ్ ఎమోషనల్

Also Read: Bodyguards Remuneration: హీరో, హీరోయిన్స్ వాళ్ల బాడీగార్డులకు ఇస్తోన్న జీతం ఎంతో తెలుసా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 
 

Trending News