పంద్రాగస్టున వరుణ్ తేజ్ స్పేస్ మూవీ టైటిల్ ప్రకటన

వరుణ్ తేజ్.. అంతరిక్షం నేపథ్యంలో సాగే ఓ తెలుగు సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Last Updated : Aug 13, 2018, 09:51 PM IST
పంద్రాగస్టున వరుణ్ తేజ్ స్పేస్ మూవీ టైటిల్ ప్రకటన

వరుణ్ తేజ్.. అంతరిక్ష సాహసాల నేపథ్యంలో సాగే ఓ తెలుగు సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఘాజీ దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో వ్యోమగామి పాత్రలో వరుణ్ నటిస్తున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ని ఆదివారం విడుదల చేశారు. సినిమా టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్‌ను కూడా ఆగస్టు 15న ఉదయం 9:30 గంటలకు ప్రకటించబోతున్నారని వరుణ్ తేజ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ సినిమాకు అంతరిక్షం అనే టైటిల్ పెడతారని ప్రచారంలో ఉంది.

అంతరిక్షంలో ఉపగ్రహానికి దగ్గరగా వెళ్తున్న వ్యోమగామి ఫోటోను వరుణ్ ఈ సందర్భంగా పోస్టు చేశారు. హాలీవుడ్ స్థాయిలో అత్యుత్తమ సాంకేతిక విలువలతో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరో, ఇతర నటులు జీరో గ్రావిటీపై ప్రత్యేక శిక్షణ తీసుకొని నటించారని మూవీ యూనిట్ తెలిపింది. వరుణ్‌తేజ్‌ సరసన అదితీరావు హైదరీ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై క్రిష్‌ జాగర్లమూడి, సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

వరుణ్‌ తేజ్‌ విక్టరీ వెంకటేష్‌తో కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 2- ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ అనే సినిమా కూడా చేస్తున్నారు.

 

Trending News