Vijay Devarkonda's Liger Trailer Review: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మాత్రమే కాక తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న 'లైగర్' ట్రైలర్ ను అట్టహాసంగా విడుదల చేసింది సినిమా యూనిట్. తెలుగులో ఈ ట్రైలర్ ను చిరంజీవి, ప్రభాస్ విడుదల చేయగా ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ముందు నుంచి చెబుతున్నట్టుగానే విజయ్ దేవరకొండను ఒక రేంజ్ లో చూపించాడు పూరీ జగన్నాధ్. ట్రైలర్ ద్వారా విజయ్ క్యారెక్టర్ ఏమిటి అనేది క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు పూరీ.
ఈ ట్రైలర్ ను కనుక మనం పరిశీలిస్తే ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే ముంబై గల్లీలలో టీ అమ్ముకునే రమ్యకృష్ణ కొడుకు విజయ్ దేవరకొండ ప్రపంచ స్థాయి బాక్సింగ్ చాంపియన్ గా ఎలా ఎదిగాడు ? అనేదే సినిమా కాన్సెప్ట్. ఈ ట్రైలర్ మొత్తం పూరీ మార్క్ తో సాగిపోయింది. హీరోకి నత్తి ఉండడంతో ఆయన చేత బూతులేమో అని భ్రమింప చేసేలా కొన్ని డైలాగ్స్ పలికించాడు పూరీ. అంతేకాక రమ్యకృష్ణ నోటి వెంట కూడా సాలా అంటూ,క్రాస్ బ్రీడ్ అంటూ పలికించడంతో ఇది ఖచ్చితంగా బోల్డ్ సబ్జెక్ట్ అని భావించవచ్చు.
దానికి తోడు రింగ్ లో విజయ్ దేవరకొండ ఫైట్ చేసిన అతనితోనే అనన్య పాండే ప్రేమలో పడినట్టు చూపడం కూడా కొంచెం కొత్తగా కనిపిస్తోంది. ఇక ఈ ట్రైలర్ ఒక్కసారిగా సినిమా మీద అమాంతం పెంచడానికి పూరీ జగన్నాధ్ ప్రయత్నిస్తాడు అనుకుంటే ఉన్న గాలి కూడా తీసేసినట్టు అయింది. ఈ ట్రైలర్ విజయ్ దేవరకొండ అభిమానులకు కూడా ఎక్కదు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. నత్తి కుర్రాడిగానే కనిపిస్తూ విజయ్ దేవరకొండ చేస్తున్న ఫైట్ సీన్లు కూడా పేలవంగా సాగుతూ ముందుకు వెళ్లాయి. విజయ్ నత్తిని అడ్డుపెట్టుకుని పూరీ బూతులు మాట్లాడించే అవకాశం కూడా లేకపోలేదు.
అయితే నిజానికి పూరీ జగన్నాధ్-విజయ్ దేవరకొండ పాన్ ఇండియా సబ్జెక్ట్ అనగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను ట్రైలర్ ఏమాత్రం అందుకోలేక పోయింది. మరి ఈ ట్రైలర్ తో జనాన్ని థియేటర్ కు రప్పించడం అనేది కష్టమైన విషయం. ఇప్పటికే కొన్ని సినిమాలకు ఒకటికి మించి ట్రైలర్లు విడుదల చేసిన క్రమంలో ఈ సినిమాకు కూడా విడుదల చేయకుంటే మాత్రం జనాన్ని థియేటర్ కు ఫుల్ చేయడం అనేది కష్టమైన విషయమే. చూడాలి మరి పూరీ ఇంకెలా జనాన్ని ఎట్రాక్ట్ చేస్తాడనేది.
విజయ్ దేవరకొండ సరసన అనన్యా పాండే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 25న విడుదల చేయనున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శక - నిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ కంపెనీ పూరి కనెక్ట్స్ తో కలిసి ఈ లైగర్ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలుగా వ్యవహరించారు.
(Note: ఇది కేవలం వీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)
Also Read: Urfi Javed: అరాచకమైన డ్రెస్లో ఉర్ఫీ జావేద్.. అన్నీ కనిపించేలా అందాల విందు!
Also Read:Liger Trailer: విజయ్ దేవరకొండ 'లైగర్' ట్రైలర్ వచ్చేసింది... రౌడీ స్టార్ నెక్ట్స్ లెవల్ అంతే..
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook