Coffee: రోజూ ఒక కప్పు కాఫీ… ఎన్ని అద్భుత ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా..

Coffee benefits: మనలో చాలామందికి కాఫీ తాగే అలవాటు ఉంది. కానీ కొంతమంది కాఫీ తాగడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది అని భయపడుతుంటారు. అయితే కాఫీ లవర్స్ కి ఓ శుభవార్త.. రోజుకి ఒక కప్పు కాఫీ క్రమం తప్పకుండా తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేమిటో తెలుసుకుందామా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 28, 2023, 09:05 PM IST
Coffee: రోజూ ఒక కప్పు కాఫీ… ఎన్ని అద్భుత ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా..

Benefits of coffee: పొద్దున నిద్రలేచిన వెంటనే వేడివేడి కాఫీ ఒక కప్ అయినా తాగకపోతే చాలామందికి రోజు ప్రారంభమైనట్టే ఉండదు. కాఫీ అనేది మన జీవితంలో అలా అద్భుతంగా కలిసిపోయింది.  చాలామంది కాఫీ తాగడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి అని అనుకుంటారు. అయితే రోజుకు ఒక కప్పు కాఫీ తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి అంటున్నారు ఫుడ్ ఎక్స్పెక్ట్స్.

Add Zee News as a Preferred Source

రోజు కాఫీ తాగడం వల్ల మన ఎనర్జీ అలానే మన శక్తి, సామర్థ్యం పెరుగుతుందని, ఇంకా పలు వ్యాధుల ప్రమాదం నుంచి సురక్షితంగా ఉండొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవును మీరు విన్నది నిజమే. చాలా మంది వ్యక్తులు తమ రోజును ప్రారంభించినప్పుడు లేదా సుదీర్ఘమైన అలసటతో బాధపడుతూ.. రోజువారీ ఆనందాన్ని పొందలేకపోతుంటారు. అలాంటి వారికి కాఫీ చాలా మంచిది.కాఫీలో కెఫీన్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందుకే కాఫీ తాగినప్పుడు మన శరీరంలో కొత్త శక్తి నిండుతుంది.. ఏకాగ్రత పెరుగుతుంది.. అలసట తగ్గడంతో పాటు మనసు ఉల్లాసంగా, ఉత్తేజంగా మారుతుంది.

అంతేకాదు కాఫీ మన మెదడు ఏకాగ్రతను పెంచుతుందట.కాఫీ పై జరిగిన ఎన్నో పరిశోధనలో తేలింది ఏమిటంటే.. అల్జీమర్స్,పార్కిన్సన్స్ లాంటి మెదడు సమస్యలు తలెత్తకుండా కాఫీ నివారిస్తుంది. 

కాఫీ తాగేవారికి జీవించాలి అన్న కోరిక ఎక్కువగా పెరుగుతుందట.. అందుకే వాళ్లు డిప్రెషన్ కి దూరంగా ఉంటారు.ఏమాత్రం భయం లేకుండా ఒత్తిడి గురైనప్పుడు.. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలనుకున్నప్పుడు నిస్సంకోచంగా ఓ కప్పు కాఫీ లాగించండి.

అంతేకాదండోయ్ కాఫీ తాగే వాళ్లకు టైపు డయాబెటిస్ వచ్చే రిస్క్ కూడా తక్కువే. ఇన్స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఆన్ కాఫీ నిర్వహించిన పరిశోధన ప్రకారం.. కాఫీ తాగడం వల్ల మనకు యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్స్ లేదా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ పుష్కలంగా దొరుకుతాయని దాని ద్వారా టైప్ 2 డయాబెటిస్ ప్రాబల్యాన్ని తగ్గించవచ్చు అని నిపుణులు తెలుపుతున్నారు.

ఇక కాఫీ రెగ్యులర్ గా తీసుకునే వారికి బరువు కూడా నియంత్రణలో ఉంటుందట. మరెందుకు ఆలస్యం డైలీ మీ కప్పు కాఫీని హ్యాపీగా ఎంజాయ్ చేయండి.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

Also Read: Belly Fat: బెల్లీ ఫ్యాట్ లేదా అధిక బరువు సమస్య వేధిస్తోందా..ఈ 3 అలవాట్లు మానండి

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News