Iron Rich Foods: ఎనీమియా సమస్యకు చెక్ చెప్పే అద్భుతమైన ఫుడ్స్ ఇవే

Iron Rich Foods: శరీరంలో అత్యంత ముఖ్యమైన ఖనిజం ఐరన్. ఇది లోపిస్తే ఎనీమియా లేదా రక్త హీనత సమస్య ఉత్పన్నమౌతుంది. ఈ సమస్య ఎక్కువగా గర్భిణీ మహిళలు, బహిష్ఠు మహిళలు, దీర్ఘకాలిక  వ్యాధిగ్రస్థులు, చిన్నారుల్లో ఉంటోంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఎంత ప్రమాదకరమో కొన్ని సులభమైన చిట్కాలతో అంత సులభంగా పరిష్కరించవచ్చు. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 11, 2024, 08:53 PM IST
Iron Rich Foods: ఎనీమియా సమస్యకు చెక్ చెప్పే అద్భుతమైన ఫుడ్స్ ఇవే

Iron Rich Foods: ఇటీవలి కాలంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు లేదా జీవనశైలి కారణంగా చాలామందిలో రక్త హీనత సమస్య కన్పిస్తోంది. రక్తంలో ఐరన్ లోపముంటే ఈ సమస్య తలెత్తుతుంది. దీనినే ఎనీమియా అంటారు. ఇది కాస్తా ఇతర సమస్యలకు దారి తీస్తుంటుంది. అందుకే రక్తహీనత సమస్యను ఎప్పుడూ తేలిగ్గా తీసుకోకూడదు. ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు కూడా. ఆహారపు అలవాట్లను క్రమబద్ధీకరించడం ద్వారా ఎనీమియా సమస్యకు చెక్ చెప్పవచ్చు. 

శరీరం చూపించే వివిధ రకాల లక్షణాల ద్వారా ఎనీమియా సమస్యను గుర్తించవచ్చు. ఎనీమియా ఉంటే తీవ్రమైన అలసట ఉంటుంది. అంటే ఏ పనీ చేయకుండానే అలసట వస్తుంటుంది. తలనొప్పి, ఆకలి మందగించడం మరో ప్రధాన లక్షణాలు. ఇక మూడు సరిగ్గా లేకపోవడం, జుట్టు రాలడం, గోళ్లు బలహీనమవడం కూడా ఇతర లక్షణాలు. అన్నింటి కంటే ప్రమాదకరమైంది శ్వాస సరిగ్గా తీసుకోలేకపోవడం, హార్ట్ బీట్ అధికంగా ఉండటం. ఇవి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంటాయి. అందుకే ఈ సమస్యను సకాలంలో పరిష్కరించగలగాలి. లేకపోతే అనర్ధాలు పెరుగుతాయి. శరీరం సమక్రమంగా పనిచేసేందుకు రక్తం చాలా అవసరం. ఈ రక్తం ద్వారానే ఆక్సిజన్ అన్ని అవయవాలకు కావల్సినంత చేరుతుంది. అందుకే ఐరన్ లోపం లేకుండా చూసుకోవాలి. ఈ సమస్య ఎక్కువగా చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, గర్భిణీ మహిళలు, సాధారణ మహిళల్లో కన్పిస్తుంటుంది. 

ప్రతి కిచెన్‌లో తప్పకుండా లభించే పదార్ధం. ఇందులో ఐరన్ పరిమాణం చాలా ఎక్కువ. విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. మనం వివిధ పదార్ధాలతో తీసుకునే ఐరన్ సంగ్రహణకు దోహద పడుతుంది.

బీట్‌రూట్ శక్తివంతమైన ఐరన్-రిచ్ లెగ్యూమ్. ఇందులో ఇనుముతో పాటు ఫోలేట్ మరియు విటమిన్ సి కూడా పుష్కలంగా ఉన్నాయి. బీట్‌రూట్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ మరియు ఎర్ర రక్త కణాల ఉత్పత్తి సులభంగా పెరుగుతుంది. దీనిని సలాడ్, కూర, రసం ఇలా అనేక రకాలుగా తీసుకోవచ్చు. ఇక రెండోది రెడ్ రాజ్మా. ఇందులో ప్రోటీన్లు, ఐరన్, ఫైబర్ పెద్దఎత్తున ఉంటాయి. ఐరన్ లోపం సరి చేసే బెస్ట్ వెజిటేరియన్ ఫుడ్ ఇదే. రాజ్మాను ఎక్కువగా చపాతీలో కూరగా తీసుకుంటారు. 

ఇక పండ్లలో దానిమ్మ బెస్ట్ ఫ్రూట్. ఇందులో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. దానిమ్మను నేరుగా తినవచ్చు లేదా జ్యూస్ రూపంలో తాగవచ్చు. ఐరన్ లోపం సరిచేసేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇక ప్రతి కిచెన్‌లో తప్పకుండా ఉండే బెల్లం ఐరన్ లోపం సరిచేసేందుకు చాలా బాగా పనిచేస్తుంది. టీతో లేదా అల్పాహారంతో తీసుకోవచ్చు. 

Also read: Vitamin C Rich Foods: విటమిన్ సి లోపముంటే ఏమౌతుంది, 5 బెస్ట్ ఫ్రూట్స్ ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News