Healthy Skin Tips: చలికాలం వచ్చిందంటే చాలు వివిధ రకాల ఆరోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు చాలా ఇబ్బంది పెడుతుంటాయి. ప్రకృతిలో లభించే పదార్ధాలతోనే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అదెలాగంటే..
అంతర్గత ఆరోగ్యంతో పాటు బాహ్య సౌందర్యం కూడా అవసరం. ముఖ్యంగా చర్మ సౌందర్యంలోనే ఆరోగ్యం దాగుంటుంది. చర్మ సౌందర్యమంటే కేవలం అందంగా కన్పించడమే కాదు..చర్మం ఆరోగ్యంగా ఉండటం. లేకపోతే అందంతో పాటు సమస్యలు కూడా వెంటాడుతాయి. అందుకే చర్మ సౌందర్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో. ఎందుకంటే చలికాలంలో చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ముఖం పగిలిపోవడం, డ్రై స్కిన్ కారణంగా దురద, చేతులు, ముఖం పేలిపోయినట్టుండటం వంటివి రకరకాలుగా ఉంటాయి. ఈ సమస్యలన్నింటికీ ప్రకృతిలో ముఖ్యంగా ప్రతి ఇంట్లో కిచెన్‌లో లభించే పదార్ధంతో(Carrot Benefits)సులభంగా చెక్ పెట్టవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు.
క్యారెట్ సహాయంతో ముఖ సౌందర్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. ఆరోగ్యపరంగా చాలా మేలు చేసే క్యారెట్ చర్మాన్ని(Health skin with Carrot) సంరక్షించడంలో కూడా దోహదపడుతుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా క్యారెట్‌ను ముక్కలుగా చేసుకుని..జ్యూస్ తయారు చేయాలి. ఆ క్యారెట్ జ్యూస్‌లో పెరుగు, ఎగ్‌వైట్ సమానంగా కలిపి మిశ్రమంగా చేసుకుని..ముఖానికి రాసుకోవాలి. ఓ పదిహేను నిమిషాలుంచుకుని..గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా అంటే కనీసం వారానికి 2-3 సార్లు చేస్తే..చర్మంపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ తొలగి..చర్మం కాంతివంతంగా మారుతుంది. అదే సమయంలో బయట తిరిగేటప్పుడు దుమ్ము, ధూళి, సూర్యరశ్మి చర్మాన్ని దెబ్బతీస్తుంటాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కూడా క్యారెట్ ఉపయోగపడుతుంది. క్యారెట్ జ్యూస్, రోజ్ వాటర్ సమానంగా కలిపిన మిశ్రమాన్ని ముఖంపై స్ప్రే చేసుకుంటే..నేచురల్ స్కిన్ ప్రొటెక్టర్‌గా పనిచేస్తుంది.
ఇక అదే క్యారెట్‌ను పేస్ట్ చేసుకుని..ఒక టీ స్పూన్ తేనె, పాలు కలుపుకుని చర్మానికి రాసుకోవాలి, పదిహేను నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే..డ్రై స్కిన్(Dry Skin)సమస్య పోతుంది. అయితే వారానికి కనీసం 3-4 సార్లు చేయాల్సి ఉంటుంది. ఇక ఇదే క్యారెట్‌తో ఆయిల్ స్కిన్ సమస్యకు కూడా చెక్ పెట్టవచ్చు. ఒక కప్పు క్యారెట్ జ్యూస్‌లో పెరుగు, శెనగపిండి, నిమ్మరసంలను ఒక్కొక్క టేబుల్ స్పూన్ కలుపుకుని..ముఖానికి, మెడకు ప్యాక్ వేసుకోవాలి. 20 నిమిషాల అనంతరం గోరు వెచ్చని నీటితో కడిగేయలి. ఇలా వారానికి 2-3 సార్లు చేస్తే మంచి ఫలితాలుంటాయి. ఇక చాలామంది ముఖ్యంగా మహిళలు స్కిన్ మృదువుగా(Soft Skin)లేదని బాధపడుతుంటారు. దీనికోసం క్యారెట్, అలోవెరా జ్యూస్ మిశ్రమాన్ని రోజు విడిచి రోజు చర్మానికి రాసుకుంటే సాఫ్ట్‌గా మారుతుంది.
Also read: Side Effects of Brinjal: వంకాయ తినడం వల్ల కలిగే నష్టాలేంటో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook