Cancer & Diabetes Remedies: ఆ కూరగాయతో కేన్సర్, డయాబెటిస్‌కు చెక్, 10 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం

Cancer & Diabetes Remedies: ప్రకృతిలో లభించే వివిధ పదార్ధాల్లోనే సకల రోగాలకు పరిష్కారముంది. అందులో ఒకటి పర్పుల్ క్యాబేజ్. పర్పుల్ క్యాబేజ్‌తో కలిగే ప్రయోజనాలు వింటే ఆశ్చర్యపోవల్సిందే.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 25, 2022, 10:52 PM IST
Cancer & Diabetes Remedies: ఆ కూరగాయతో కేన్సర్, డయాబెటిస్‌కు చెక్, 10 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం

చలికాలం రాగానే ఆకుపచ్చ కాయగూరల వినియోగం పెరుగుతుంది. అయితే పర్పుల్ క్యాబేజ్ మీకు అందుబాటులో ఉంటే వెంటనే మీ డైట్‌లో చేర్చేయండి. ఆరోగ్యపరంగా మీరు ఊహించని లభాలు కలుగుతాయి.

చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా ఎన్నో రకాల వ్యాధులు చుట్టేస్తుంటాయి. ఈ వ్యాధుల్లో ముఖ్యమైంది స్థూలకాయం. ఎన్నిరకాలుగా ప్రయత్నించినా కొంతమంది స్థూలకాయం నుంచి విముక్తి పొందలేరు. ఈ పరిస్థితుల్లో మీ డైట్‌లో పర్పుల్ కలర్ క్యాబేజ్ చేర్చితే..చాలా ప్రయోజనముంటుంది. ఇందులో ఐరన్, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కే పుష్కలంగా ఉంటాయి. శరీరంలో పోషక పదార్ధాల కొరత తీరిపోతుంది. 

అధిక బరువు నుంచి ఉపశమనం పొందేందుకు పర్పుల్ క్యాబేజ్ కీలకంగా ఉపయోగపడుతుంది. శరీరంలోని బ్లడ్ షుగర్ లెవెల్ నియంత్రణలో ఉంటుంది. ఇందులో న్యూట్రిషన్ మోతాదు చాలా ఎక్కువ. దీనిని డైట్‌లో చేర్చుకుంటే అధిక బరువు సమస్య నుంచి ఉపశమనం పొందడమే కాకుండా..కేన్సర్, డయాబెటిస్ వంటి తీవ్ర వ్యాధులు కూడా దూరమౌతాయి. పర్పుల్ క్యాబేజ్..శరీరంలో పేరుకున్న కొవ్వును తగ్గిస్తుంది. పలితంగా బరువు తగ్గుతారు.  ఇందులో ఉన్న పోలీఫెనాల్‌తో కేన్సర్, గుండెరోగాలు, డయాబెటిస్ వ్యాధుల ముప్పు తగ్గుతుంది. 

పర్పుల్ క్యాబేజ్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫలితంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అజీర్తి సంబంధిత ఇబ్బందులు దూరమౌతాయి. చర్మానికి చాలా మంచిది. ఇందులో ఉన్న యాంటీ ఏజీయింగ్ గుణాల కారణంగా చర్మం నిగనిగలాడుతూ..యౌవ్వనంగా కన్పిస్తారు. కంటి కింది డార్క్ సర్కిల్స్ దూరమౌతాయి.

Also read: Shampoos Causing cancer: ఈ షాంపూలు వాడొద్దు వాడితే క్యాన్సరే.. ఆ లిస్టులో మీ షాంపూ ఉందేమో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News