Guava Leaf For Diabetes Control: శీతాకాలం అధికంగా లభించే పండ్లలో జామ పండ్లు ఒకటి. జామ చాలా రకాలుగా మార్కెట్‌లో లభిస్తుంది. ముఖ్యంగా మనందరికీ తెలిసినవి రెండు రకాలు ఒకటి తెల్ల రంగు జాతికి చెందినవైతే, రెండవది ఎరుపు రంగు జాతికి చెందినవి. ఇవి రెండు శరీరానికి ఒకే రకమైన ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఇందులో శరీరానికి కావాల్సిన విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్స్, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. కాబట్టి వీటిని తరచుగా తీసుకుంటే అనేక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. అయితే జామ పండ్లతోనే కాకుండా శరీరానికి వాటి ఆకులతో కూడా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఎలా వినియోగించాలి..?:
జామ ఆకుల నుంచి ప్రయోజనాలు పొందడానికి ప్రతి రోజూ ఆకులను ఉడకబెట్టి మనం టీలా తయారు చేసుకుని తాగొచ్చు. అయితే ఆకులను తీసుకుని నీటిలో ఉడకబెట్టి ఆ తర్వాత అందులో తేనెను కలిపి తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణ ఉంటుంది:
జామ ఆకుల్లో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఈ ఆకుల టీ ప్రభావం శరీరంలో ఎక్కువ కాలం ఉంటుందని కాబట్టి మధుమేహంతో బాధపడుతున్న వారు క్రమంత తప్పకుండా తీసుకుంటే శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది.
క్యాన్సర్ ప్రమాదాన్ని నియంత్రిస్తుంది:
జామ ఆకుల్లో క్యాన్సర్ నిరోధక గుణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. ఈ ఆకులు క్యాన్సర్ కణాల పెరుగుదలను ఆపడానికి కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
రోగనిరోధక శక్తిని పెంచుతాయి:
ఈ ఆకుల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి క్రమం తప్పకుండా ఈ టీని తాగితే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా జలుబు వంటి వ్యాధుల ప్రమాదాన్ని సులభంగా తగ్గిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా ఈ టీలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
అతిసారం:
జామ ఆకుల్లో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు పేగు ఇన్ఫెక్షన్లను నయం చేయడానికి సహాయపడతాయి. అతిసారం వంటి సమస్యలకు ఈ ఆకుల టీ ప్రభావవంతంగా పని చేస్తుంది. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ టీని తీసుకోండి.
Also Read: Pak Vs NZ: డారిల్ మిచెల్ మెరుపులు.. పాక్ టార్గెట్ ఎంతంటే..?
Also Read: Haris Rauf: హరీస్ రవూఫ్ బర్త్ డే.. షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్ ఏ చేశారో చూడండి.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook