Diabetes Management Tips: దేశవ్యాప్తంగా డయాబెటిస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. పెరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకుని తప్పకుండా జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలా మంది మధుమేహంతో బాధపడేవారు మార్కెట్‌లో లభించే పలు రకాల రసాయనాలతో కూడిన మందులను వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉన్నప్పటికీ..కొన్ని రోజుల తర్వాత తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు తీసుకునే ఆహారాలతో పాటు మందులపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
మధుమేహంతో బాధపడేవారు వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండడాల్సి ఉంటుంది. అంతేకాకుండా శరీరక శ్రమ చేయడం కూడా చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ వ్యాధితో బాధపడేవారు ఉదయం పూట అల్పాహారంలో భాగంగా తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు కొన్ని ఆరోగ్యకరమైన ఫ్రూట్ షేక్‌లు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
యాపిల్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు:
రెండు కప్పుల యాపిల్ ముక్కలు.
1 కప్పు తియ్యని ఓట్స్
1 కప్పు బాదం పాలు
1/4 టీస్పూన్ దాల్చినచెక్క
ఐస్ క్యూబ్స్
ఖర్జూరం
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్మూతీ తయారీ పద్ధతి:
ముందుగా బ్లెండర్లో యాపిల్ ముక్కలను వేసుకోవాల్సి ఉంటుంది.
అందులోనే 1 కప్పు బాదం పాలు, తియ్యని ఓట్స్ వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి.
అందులోనే తొలచిన ఖర్జూరను వేసి బాగా మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది.
ఇలా తయారు చేసుకున్న స్మూతీలో ఐస్ క్యూబ్స్ వేసి బాగా కలుపుకోవాలి.
ఈ స్మూతీని ప్రతి రోజు తాగితే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
యాపిల్ స్మూతీలో శరీరానికి కావాల్సిన ఫైబర్ అధికంగా పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు దీనిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ, సిలు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఖర్జూరలో ఐరన్, పొటాషియం లభిస్తుంది. కాబట్టి ఈ షేక్ ప్రతి రోజు తీసుకోవడం వల్ల సులభంగా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా దీనిని జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు తాగడం వల్ల జీర్ణ మంచి ఫలితాలు పొందుతారు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి