డయాబెటిస్ అనేది ప్రపంచంలో ఎక్కువగా విస్తరిస్తున్న వ్యాధుల్లో ఒకటి. నియంత్రించకపోతే ప్రాణాంతకం కావచ్చు. ఇది ఓ రకమైన మెటబోలిక్ డిజార్డర్. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి సరిగ్గా లేకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది.
డయాబెటిస్ అనేది రెండు రకాలు టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్.టైప్ 1 డయాబెటిస్ సాధారణంగా జెనెటిక్స్ కారణంగా వస్తుంది. టైప్ 2 డయాబెటిస్ చెడు జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా సోకుతుంది. దురదృష్టవశాత్తూ డయాబెటిస్ రోగానికి చికిత్స లేదు. జీవనశైలిలో మార్పులతో నియంత్రించవచ్చు. ఫిజియోథెరపీ కూడా డయాబెటిస్‌ను నియంత్రించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. డయాబెటిస్ రోగులకు ఫిజియోథెరపీ ఎలా ఉపయోగపడనుందో తెలుసుకుందాం..
నిర్ణీత పద్ధతిలో ఫిజియోథెరపీ చేయడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రోగులపై సానుకూల ప్రభావం పడుతుంది. ఇతర వ్యాధులతో బాధపడేవారికి కూడా ఫిజియోథెరపీ మంచి ఫలితాలనిస్తుంది. ఫిజియోథెరపీ అనేది కేవలం డయాబెటిస్ లక్షణాలు ముదరకుండా చేయడమే కాకుండా..ఉన్న లక్షణాల్ని నియంత్రించడంలో కూడా ఉపయోగపడుతుంది. హెల్తీ వెయిట్ సాధించడంలో దోహదపడుతుంది. రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. అలసటను దూరం చేస్తుంది. మస్కిలోస్కెలేటల్ సమస్యల్ని తగ్గించడంలో దోహదపడుతుంది.
డయాబెటిస్ ముప్పు దూరం
ఫిజియోథెరపీ చేయడం, సరైన డైట్ తీసుకోవడం ద్వారా హెల్తీ వెయిట్ సాధించవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం ద్వారా డయాబెటిస్ ముప్పును తగ్గించవచ్చు. భవిష్యత్తులో ఏ విధమైన సమస్య లేదా రోగాల్నించి కాపాడుకునేందుకు ఫిజియోథెరపీ మంచి పరిష్కారం కాగలదు.
Also read: Sore Throat: గొంతులో గరగరను తేలిగ్గా తీసుకుంటే ప్రమాదం, ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook