Health benefits of Almonds: రోజూ బాదం తింటే ఇన్ని ప్రయోజనాలా ?

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే సంగతి తెలిసిందే. అందులోనూ బాదం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు. రక్తంలో చక్కర స్థాయిని అదుపులో ఉంచడం నుంచి మొదలుకుని అధిక కొలెస్ట్రాల్‌ని కోల్పోయి బరువు తగ్గడం వరకు ఎన్నో లాభాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Last Updated : Jan 3, 2021, 06:20 AM IST
Health benefits of Almonds: రోజూ బాదం తింటే ఇన్ని ప్రయోజనాలా ?

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే సంగతి తెలిసిందే. అందులోనూ బాదం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు. రక్తంలో చక్కర స్థాయిని అదుపులో ఉంచడం నుంచి మొదలుకుని అధిక కొలెస్ట్రాల్‌ని కోల్పోయి బరువు తగ్గడం వరకు ఎన్నో లాభాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

బాదంలో ప్రోటీన్, ఫైబర్, ఇతర ముఖ్యమైన పోషకాలు అధికంగా ఉన్నందున అవి రోజూ తింటే శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

మీ శారీరక శక్తి సామర్థ్యాలను పెంచడానికి బాదం సహాయపడుతుంది.

బాదం పలుకులు, బాదం పాలతో ఒంటికి కావాల్సినంత కాల్షియం ( Badam milk health benefits ) లభిస్తుంది.

కొలెస్ట్రాల్ స్థాయిలను ( Cholesterol levels ) తగ్గించడానికి బాదం ఎంతగానో సహాయపడుతుంది.

బాదం పాలు ఆవు పాలకు ( Cow milk ) గొప్ప ప్రత్యామ్నాయం. ఆవు పాలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో.. బాదం పాలు కూడా అంతే మేలు చేస్తాయి.

వెన్న, పాల ఉత్పత్తులకు రుచికరమైన, ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా బాదం పాలను ఎంచుకోవచ్చు.

రక్తంలో చక్కెర స్థాయిలను ( Sugar levels in blood ) నియంత్రించడానికి బాదం ఎంతో సహాయపడుతుంది.

బాదం నూనెను ( Almond oil ) క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల మీ జుట్టు కురులు మెరుస్తూ ఉంటాయి. చర్మానికి బాదం నూనెతో మర్దన చేసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది.

బాదాంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు అనేక జబ్బులు, అనారోగ్య సమస్యల నుంచి రక్షణ ఇస్తాయి. నిత్యం బాదాం తీసుకునే వారిలో వృద్ధాప్యం సైతం అంత సులువుగా దరి చేరదని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ ( Health experts ) చెబుతున్నారు.  

లాస్ట్ బట్ నాట్ లీస్ట్... శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గించడంలో బాదం ఉపయోగపడుతుంది. తద్వారా అధిక బరువు కోల్పోవడానికి ( Weight loss tips ) సైతం బాదం పరోక్షంగా సహాయపడుతుంది.

Trending News